close
Choose your channels

నాలుగు భాషల్లో 'క్యాంపస్ - అంపశయ్య'

Monday, May 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మా నీకు వంద‌నం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ జైని తాజాగా 'క్యాంపస్ అంపశయ్య' పేరుతో ఓ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాకర్ జైని కూడా ప్రధాన పాత్ర చేశారు. శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్ గా నటించారు.

జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1969లో న‌వీన్ రాసిన 'అంపశయ్య' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత నవీన్ ఇంటి పేరు 'అంపశయ్య' అయిపోయింది.

ఈ చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని తెలియజేస్తూ - ''ఈ కథలో చక్కటి ఆత్మ ఉంది. విలువలున్నాయి. మానసిక సంఘర్షణలున్నాయి. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అన్ని భాషలవాళ్లకీ సూట్ అయ్యే కథ ఇది. అందుకే ఇతర భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. 'అంపశయ్య' నవల అందరికీ నచ్చింది. ఈ నవలను అందరికీ నచ్చే విధంగా తెరరూపం ఇవ్వడం జరిగింది. ఓ గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి చదువుకోవడానికి వచ్చిన ఓ యువకుడి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. కథానుగుణంగా ఉస్మానియా క్యాంపస్ లో కీలక సన్నివేశాలు తీశాం. ఈ క్యాంపస్ లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే. 1970ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించాం. అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రం అవుతుంది. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment