బెల్లంకొండ సినిమా నుండి వెళ్లిపోయిన కెమెరామెన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి అప్పుడే సినిమాటోగ్రాఫర్ డూడ్లీ వెళ్లిపోయాడని, ఆయన స్థానంలో ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. బాలీవుడ్ చిత్రాలైన చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం చిత్రాలకు డూడ్లీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మేకింగ్ విషయంలో సంతోశ్ శ్రీనివాస్, డూడ్లీకి మధ్య సఖ్యత కుదరక పోవడంతో డూడ్లీ బై బై చెప్పేశాడట. సంతోశ్ శ్రీనివాస్ గతంలో కెమెరామెనే కావడంతో ఇప్పుడు షాట్స్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఇది భరించలేని డూడ్లీ వెళ్లిపోయాడనేది టాక్.
రెండో షెడ్యూల్‌కు ఛోటా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రత్యేకంగా 8ప్యాక్స్‌తో మేకోవర్ అయ్యారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గత ఏడాది రాక్షసుడుతో సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ మణికొండలో వేసిన భారీ సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments