మహేష్ కు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉందన్న కెమెరామేన్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా.. దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను` సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాకి తిరు, శ్రీకర్ ప్రసాద్ వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సినిమాటోగ్రాఫర్ తిరు మాట్లాడుతూ “సినిమా యొక్క సాంకేతిక అంశాల గురించి బాగా తెలిసిన ఉత్తమమైన నటుడు మహేష్ బాబు.
భరత్ అనే నేను` కోసం తనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మహేష్‌తో మరిన్ని సినిమాలు చేయాలని వుంది” అంటూ మహేష్‌ను ట్విట్టర్లో కొనియాడారు. ప్రస్తుతం పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం....మార్చి రెండో వారం కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోబోతోందని తెలిసింది. ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments