ర‌జ‌నీకాంత్ సినిమాలో కెమెరామెన్ కుమార్తె...

  • IndiaGlitz, [Friday,August 17 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ చిత్రం 'మ‌హర్షి' సినిమాకు కె.యు.మోహ‌న‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న కుమార్తె.. మాళ‌విక మోహ‌న‌న్ న‌టిగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఈమె.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు.

మ‌జిద్ మ‌జిద్స్ బియాండ్ అనే ఇరానీ చిత్రం ద్వారా న‌టిగా ఎంట్రీ ఇచ్చిన మాళ‌విక మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ర‌జ‌నీకాంత్, కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇందులో సిమ్రాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధికీ, విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.