ఆక్సిజన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి: సీపీ మహేష్ భగవత్

  • IndiaGlitz, [Saturday,May 15 2021]

కరోనా ఉధృతి మరింత పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ కొరత ప్రాణాలను హరించి వేస్తోంది. సకాలంలో ప్రాణవాయువు అందక కరోనా రోగులు చాలా మంది ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి ఉచిత వాహన సర్వీ‌సును ప్రారంభించారు. మహీంద్రా లాజిస్టిక్స్‌ - రాచకొండ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ఆన్‌ వీల్‌ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఆక్సిజన్ సిలిండర్లను రాచకొండ పోలీసులకు అందజేశారు.

ఇప్పటికే రాచకొండ పోలీసులు నాలుగు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదిస్తే వారికి ఆక్సిజన్‌ను అందజేస్తారు. ఇప్పటికే ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆక్సిజన్‌ ఆన్‌వీల్స్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రీఫిల్లింగ్‌ ప్లాంట్స్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం, ఖాళీ అయిన సిలిండర్లను రీఫిల్లింగ్‌ ప్లాంట్స్‌కు తరలించడం ఈ వాహనాల ముఖ్య ఉద్దేశమని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వాహన సేవలు అవసరమైన వారు కొవిడ్‌ కంట్రోల్‌ నంబర్‌ 9490617234, మహీద్రార లాజిస్టిక్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-7386420259లో సంప్రదించాలన్నారు.

ఈ నంబర్లకు ఫోన్ చేసి వాట్సప్‌లో డీటైల్స్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికే అందజేస్తారన్నారు. పేషంట్ వివరాలు డాక్టర ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ల ఇంటికి పంపిస్తామన్నారు. ఫస్ట్ ఫేజ్‌తో పోలిస్తే సెకెండ్ ఫేజ్‌లో చాలా వేగంగా వైరస్ పాకుతోంది. ఈ క్రమంలోనే ప్లాస్మా దానానికి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ముందుకు రావాలని సీపీ పిలుపునిచ్చారు. ప్లాస్మా దాతలు RKSC.donateplasma.in లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. తాను కూడా ప్లాస్మా దానం చేసేందుకు ఉన్న A+ve ప్లాస్మా కావాలంటే తాను ఇస్తానని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.

More News

తుఫాన్‌ అలర్ట్‌.. 16 నాటికి అత్యంత తీవ్రంగా ‘తౌక్టే’

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది.

బ్లాక్ ఫంగస్ రావడానికి ఆ నీరే కారణం..!

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం అల్లాడుతుంటే.. ఇది చాలదన్నట్టు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కూడా వచ్చేసింది.

కొవిడ్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో

కొవిడ్ బాధితులకు భారతీయ రక్షణ సంస్థ(డీఆర్‌డీవో) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారంలో

ఈటలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి కేటీఆర్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రాజకీయంగా పూర్తిగా దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది.

రఘురామ అరెస్ట్.. ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..

కొన్ని నెలలుగా వైసీపీకి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.