ఇసుక అక్రమంగా తరలిస్తే ఈ నంబర్‌కు కాల్ చేయండి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇసుక అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా ప్రభుత్వం తాట తీసేస్తుంది అంతే.! ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క..!. అక్రమ రవాణా నియంత్రణకు ఇసుక ధరలకు మించి అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష. రూ. 2 లక్షల జరిమానా విధించేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 14500ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసినా.. చూసినా.. ఈ నంబర్‌కు ఫిర్యాదులు చేయొచ్చని వైఎస్ జగన్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్వయంగా కాల్ చేసి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు జగన్ పలు సలహాలు, సూచనలు చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే రియాక్ట్ కావాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. కాగా.. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టాక్ పాయింట్ ద్వారా రోజుకు 2 లక్షల టన్నుల ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపిన విషయం విదితమే.
కాగా.. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు సుమారు 50 మంది దాకా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆందోళనలు చేపట్టాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు దిగిన విషయం విదితమే. ఇలా ప్రతిపక్షాలు వరుసగా ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో ఎట్టకేలకు దీనికి సంబంధిం పాలసీని తీసుకురావడం.. వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే ఇది తమ విజయమే అని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. జగన్ చేస్తున్న ఈ పాలసీ, టోల్ ఫ్రీ నంబర్ వ్యవహారాలన్నీ మరణాల సంభవించక ముందే చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout