నిమ్మగడ్డకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. ఏపీలో రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వానికి ససేమిరా ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఏ విషయంలోనూ సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా వైసీపీ మంత్రులు నిమ్మగడ్డపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు.
సీఎం జగన్ కూడా నిమ్మగడ్డపై కోపంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కట్టడి చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇటీవల కోవిడ్ ప్రభావం కాస్త తగ్గిందని.. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి కాబట్టి ఫిబ్రవరిలో ఏపీలో సైతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అప్పటి నుంచి రగడ స్టార్ట్ అయింది. ఆయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టబోతే ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సీఎస్ వరకూ ఎవరూ సహకరించలేదు. పైగా మంత్రులు నోటికి పని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే నిమ్మగడ్డకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. మార్చిలో ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఏపీలో ఏం జరుగుతోంది? అధికారులు ఎవరు సహకరించడం లేదు? ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు? ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన అంశాలేంటి?
ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారెవరు? సహకరించని అధికారులు.. లేఖలు రాసినా స్పందించని అధికారులు ఎవరు? తదితర విషయాలపై సీఈసీ.. నిమ్మగడ్డతో చర్చించనున్నట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ రావాలని నిమ్మగడ్డకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com