కేఫ్ కాఫీ డే అధినేత సిద్దార్థ్ మిస్సింగ్.. అసలు కథ ఇదీ..!!
- IndiaGlitz, [Tuesday,July 30 2019]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్దార్థ్ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. నేత్రావతి నదిలో సిద్దార్థ్ దూకినట్లు సమాచారం. కాగా అదృశ్యానికి ముందు బెంగళూరు నుంచి సఖిలేష్‌పూర్‌కు సిద్దార్థ్ బయల్దేరారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. సడెన్‌గా రూటు మార్చాలని డ్రైవర్‌తో సిద్దార్థ్‌కు చెప్పారు. నేత్రావతి నది వద్దకు రాగానే కారు ఆపాలని డ్రైవర్‌కు చెప్పి దిగి లోనికి వెళ్లారు. అరగంటపాటు కలియదిరిగి నేత్రావతి నదిలో ఆయన దూకారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సిద్దార్థ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన నదిలో దూకారా..? లేకుంటే అక్కడ్నుంచి తప్పించుకుని నదీమార్గాన ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఫెయిలయ్యా.. వెళ్లిపోతున్నా..!
ఇదిలా ఉంటే.. మిస్సింగ్‌కు ముందు ఉద్యోగులకు సిద్ధార్థ్ లేఖ రాశారు. కాఫీ డే 7,000 కోట్ల నష్టాల్లో ఉందని, కంపెనీ ఆస్తులు, అప్పుల వివరాల జాబితాను అందిస్తూ డైరెక్టర్ల కంపెనీ కొత్త మేనేజ్‌మెంట్ నిర్వహణలో నడపాలి. ఎవరినీ మోసం చేయడం లేదా తప్పు దోవ పట్టించాలనే ఉద్దేశం నాకు లేదు. కాఫీ డే కంపెనీ వ్యవస్థాపకుడిగా నేను విఫలమయ్యాను. కంపెనీకి లాభాలు తీసుకురాలేకపోయాను. పారిశ్రామిక వేత్తగా ఫెయిలయ్యాను. చాలా ఏళ్లుగా పోరాడాను.. కానీ ఓడిపోయాను. నాపై ప్రైవేట్ ఈక్విటి పార్టనర్ల ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఆరునెలల క్రితం ఓ ఫ్రెండ్ దగ్గర భారీగా అప్పుచేశాను. షేర్లు అమ్మాలని నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఏదో ఒకరోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. బోర్డు సభ్యులు, కుటుంబసభ్యులు నన్ను క్షమించండి. నా లావాదేవీల గురించి మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదు. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత అని లేఖలో సిద్ధార్థ్ పేర్కొన్నారు.
చివరి ఫోన్ కాల్ ఎవరితో..!
ఇదిలా ఉంటే మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. సిద్దార్థ్ చివరిగా ఎవరితో ఫోన్ మాట్లాడారు..? ఏం మాట్లాడారు..? ఫోన్‌లో ఏమేం మాట్లాడుకున్నారు..? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే సిద్ధార్థ ఎవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారు..? అనే విషయాలు తెలిస్తే ఈ మిస్సింగ్ కేసులో స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సిద్ధార్థ్ ఘనత ఇదీ..!
కాగా.. 1990లో మొదటిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో కేఫ్ కాఫీ డేను ఏర్పాటు చేసి ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో చేరు. తన కేఫ్ కాఫీ డే సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించారు. బెంగళూరులోని చిక్‌మంగళూరులో 12వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది. కాగా.. ఎస్ఎం కృష్ణ కుమార్త మాళవికను వీజీ సిద్దార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.