ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో సి. కళ్యాణ్ ప్యానెల్ గెలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌కు సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఈ ఎన్నికల్లో సి.కళ్యాణ్, దిల్ రాజుకు చెందిన ప్యానెల్స్ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో కల్యాణ్ ప్యానెల్ సత్తా చాటింది. కాగా మొత్తం 12 ఈసీలకు గాను ‘మన ప్యానెల్’ నుంచి 9 మంది ఎన్నికయ్యారు. మరోవైపు దిల్ రాజుకు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఎన్నిక కాబడ్డారు.
దిల్‌రాజు, దామోదర్‌లు ఈసీ మెంబెర్స్‌గా విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్‌గా మోహన్ గౌడ్ గెలుపొందటం విశేషమని చెప్పుకోవచ్చు.
వివాదాల నడుమ..!
కాగా.. ఈసారి ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా సాగాయని చెప్పుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య ఎన్నికల జరగడం గమనార్హం. శనివారం ఉదయ 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1438 మంది సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో నిర్మాతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడం చాంబర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రసన్నకుమార్, నట్టికుమార్ లాంటి పెద్దోళ్లు రంగంలోకి దిగడం వివాదం సద్దుమణిగింది.
‘మన ప్యానెల్’ సభ్యులు వీరే...
తుమ్మల ప్రసన్నకుమార్
వై.వి.ఎస్.చౌదరి
పల్లి కేశవరావు
నట్టి కుమార్
మోహన్ వడ్లపట్ల
ఎం. శివకుమార్
తుమ్మలపల్లి రామసత్యనారాయణ
జె.పుల్లారావు
వి.సాగర్
డి.రమేశ్‌బాబు
సి.ఎన్.రావు
యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున..
దిల్ రాజు
డీవీవీ దానయ్య
కొర్రపాటి సాయి
వై. రవిశంకర్
శివలెంక కృష్ణ ప్రసాద్
భోగవల్లి ప్రసాద్
దామోదరప్రసాద్
ఆచంట గోపీనాథ్
సూర్యదేవర నాగవంశీ
బెక్కెం వేణుగోపాల్
కె.కె. రాధామోహన్ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఈ ప్యానెల్ నుంచి కేవలం దిల్‌రాజు, దామోదర్‌లు మాత్రమే గెలిచారు.
ఇదిలా ఉంటే.. సి.కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం జరిగిన ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్’ ఎన్నికల్లో కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం విదితమే. తన సమీప ప్రత్యర్ధి ప్రతాని రామకృష్ణ గౌడ్ పై ఒకట్రెండు కాదు ఏకంగా 283 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout