ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో సి. కళ్యాణ్ ప్యానెల్ గెలుపు

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌కు సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఈ ఎన్నికల్లో సి.కళ్యాణ్‌, దిల్ రాజుకు చెందిన ప్యానెల్స్ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో కల్యాణ్ ప్యానెల్ సత్తా చాటింది. కాగా మొత్తం 12 ఈసీలకు గాను ‘మన ప్యానెల్’ నుంచి 9 మంది ఎన్నికయ్యారు. మరోవైపు దిల్ రాజు‌కు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ‌ ప్యానెల్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఎన్నిక కాబడ్డారు.
దిల్‌రాజు, దామోదర్‌లు ఈసీ మెంబెర్స్‌గా విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్‌గా మోహన్ గౌడ్ గెలుపొందటం విశేషమని చెప్పుకోవచ్చు.

వివాదాల నడుమ..!

కాగా.. ఈసారి ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా సాగాయని చెప్పుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య ఎన్నికల జరగడం గమనార్హం. శనివారం ఉదయ 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1438 మంది సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో నిర్మాతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడం చాంబర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రసన్నకుమార్, నట్టికుమార్ లాంటి పెద్దోళ్లు రంగంలోకి దిగడం వివాదం సద్దుమణిగింది.

‘మన ప్యానెల్’ సభ్యులు వీరే...

తుమ్మల ప్రసన్నకుమార్‌
వై.వి.ఎస్‌.చౌదరి
పల్లి కేశవరావు
నట్టి కుమార్‌
మోహన్‌ వడ్లపట్ల
ఎం. శివకుమార్‌
తుమ్మలపల్లి రామసత్యనారాయణ
జె.పుల్లారావు
వి.సాగర్‌
డి.రమేశ్‌బాబు
సి.ఎన్‌.రావు

యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్ తరఫున..

దిల్‌ రాజు
డీవీవీ దానయ్య
కొర్రపాటి సాయి
వై. రవిశంకర్‌
శివలెంక కృష్ణ ప్రసాద్‌
భోగవల్లి ప్రసాద్‌
దామోదరప్రసాద్‌
ఆచంట గోపీనాథ్‌
సూర్యదేవర నాగవంశీ
బెక్కెం వేణుగోపాల్‌
కె.కె. రాధామోహన్‌ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఈ ప్యానెల్ నుంచి కేవలం దిల్‌రాజు, దామోదర్‌లు మాత్రమే గెలిచారు.

ఇదిలా ఉంటే.. సి.కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం జరిగిన ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్’ ఎన్నికల్లో కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం విదితమే. తన సమీప ప్రత్యర్ధి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పై ఒకట్రెండు కాదు ఏకంగా 283 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

More News

‘గుణ 369’ స్టోరీని సింగిల్‌ లైన్‌లో చెప్పేసిన నిర్మాతలు!

కార్తికేయ, అనఘా నటీనటులుగా అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన చిత్రం ‘గుణ 369’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రంలో కార్తికేయ సరికొత్త లుక్‌లో

ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏసియన్ సినిమాస్ అధినేత

‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్), నిర్మాతల మండలి ఎన్నికలు ఇలా వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు.

కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను ఆద‌రిస్తార‌ని `నేనులేను` విజ‌యంతో మ‌ళ్ళీ రుజువైంది - హీరో హ‌ర్షిత్‌

ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేను లేను`...

జ్యోతిక 'జాక్‌పాట్ 'ట్రైలర్, ఆడియో విడుదల

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు

ప్రజలు నవ్వుకుంటున్నారు బాబూ.. మైండ్‌సెట్ మార్చుకోండి!!

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక చట్టాలను