ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని సక్సెస్ చేసిన అభిమానులకు థాంక్స్ - నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
- IndiaGlitz, [Sunday,January 08 2017]
సీమశాస్త్రి, సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో వచ్చిన చిత్రం 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో.....
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''ఈ ఇయర్ ఎండింగ్‌లో ఎంటర్‌టైన్మెంట్ బేస్‌గా చేసిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా పెద్ద సక్సెస్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''అల్లరి నరేష్ కెరీర్‌లో సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు పెద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. మా కాంబినేషన్‌లో మూడో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారో నాకు తెలుసు. అందుకే హాయిగా నవ్వుకునే సినిమా చేయాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఎంటర్‌టైన్మెంట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. నరేష్‌తో ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ - ''2014 నుండి ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయ్యింది. గ్రేట్ జర్నీ. అందరూ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. సినిమా కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యిందని అనుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్'' అన్నారు.
హీరోయిన్ కృతిక మాట్లాడుతూ - ''మంచి ఎంటర్‌టైనింగ్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సపోర్ట్ చేసిన నరేష్‌గారికి థాంక్స్'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ - ''ఈ ఏడాదిలో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి సక్సెస్‌ఫుల్ మూవీస్ చేశాను. ఈ ఏడాది చివరల్లో మంచి హిట్ చిత్రానికి మ్యూజిక్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నేను చేసిన రెండో సినిమా, అల్లరి నరేష్‌గారితో నేను చేసిన నాలుగో సినిమా. సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో జయవాణి, శ్రీసుధ, విక్రమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.