close
Choose your channels

'ఛత్రపతి' నా కెరీర్ లో మరుపురాని అనుభూతినిచ్చిన సినిమా -- బివిఎస్ఎన్ ప్రసాద్

Wednesday, September 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్‌ హీరోగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడిగా, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ఛత్రపతి` రిలీజై 10 వసంతాు పూర్తయింది. 30 సెప్టెంబర్‌ 2005లో రిలీజైన ఈ చిత్రంతో మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రభాస్‌కి, యాక్షన్‌ డైరెక్టర్‌గా ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇదే సినిమాతో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ఛత్రపతి` ప్రసాద్‌గా ఫేమస్‌ అయ్యారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఛత్రపతి` రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా
స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఛత్రపతి ప్రసాద్‌`తో స్పెషల్‌ ఇంటర్వ్యూ..

ఛత్రపతి` రిలీజై 10 వసంతాు పూర్తయింది. ఛత్రపతి ప్రసాద్‌గా మీకు గుర్తింపునిచ్చిన ఈ సినిమా విశేషాు?
చత్రపతి సినిమా రిలీజై 10 సంవత్సరాలైంది. అంతకంటే ముందే 15 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా. ఎన్నో విజయవంతమైన సినిమాు చేసినా, ఛత్రపతి సినిమాతో ప్రత్యేకించి గుర్తింపు దక్కింది. ఈ సినిమాతోనే ఛత్రపతి ప్రసాద్‌గా పరిశ్రమలో పాపుర్‌ అయ్యాను. నా జీవితంలో మర్చిపోలేని సినిమా.

ప్రభాస్‌ -రాజమౌళి కయికలో తొలి సినిమా... నాటి జ్ఞాపకాు?

ప్రభాస్‌ - రాజమౌళి కయికలో సినిమా చేయానుకున్నప్పుడు .. ముందుగా ప్రభాస్‌ ఈ కథ విని, బావుంది చేద్దామని అన్నాడు. తను కథని నమ్మాడు. మీ వెంట నేను ఉన్నా అంటూ ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళితో కలిసి ముందుకు వెళ్లాం. ఎస్‌.ఎస్‌.రాజమౌళి అప్పటికే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌. వరుసగా మూడు హిట్లున్నాయి. ఈరోజు నా దర్శకుడు, హీరో ఇంటర్నేషనల్‌ ఫేమస్‌. బాహుబలి వంటి గొప్ప సినిమాని తొగు సినీపరిశ్రమకి అందించినందుకు ఆనందంగా ఉంది.
ప్రభాస్‌ మాస్‌ ఇమేజ్‌ గురించి మీ అభిప్రాయం?
చత్రపతి సినిమాతో యాక్షన్‌ హీరోగా ప్రభాస్‌కి మాస్‌లో ఇమేజ్‌ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా రిలీజై 10 ఏళ్లు అయినా ఇంకా గుర్తుండిపోయింది అంటే ప్రభాస్‌ నటన వల్లే.

తొలి సన్నివేశం చిత్రీకరించినప్పుడు అనుభూతి?

ఈ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరిగింది. అది ఎప్పటికీ మర్చిపోలేనిది. సముద్రంలోకి భారీ క్రేన్‌తో షూటింగ్‌... సముద్రం మధ్యలో షార్క్‌తో సన్నివేశం.. పైగా కథానాయిక అక్కడికి వెళ్లడంతో రిస్క్‌ అవుతుందేమోనని భయపడ్డాను.

మరోసారి ప్రభాస్‌ - రాజమౌళి కయికలో సినిమా ఎప్పుడు?

ఆ అవకాశం కోసం ఎంతో వేచి చూస్తున్నా. ప్రస్తుతం బాహుబలి 2 బిజీలో ఉన్నారు. రాజమౌళితో షూటింగ్‌ అంటే అది మెమరబుల్‌గా ఉంటుంది. మరి మా కయిక ఎప్పటికి కుదురుతుందో?
తుది వాక్యం?
ఛత్రపతి సినిమాతో ఎంతో పేరొచ్చింది. బుల్లితెరపై ఎప్పుడు ఈ సినిమా వేసినా వెంటనే ఫోన్లు వస్తుంటాయి. అలా ఫోన్‌ు చేసి అడగడం మరపురాని అనుభూతినిస్తుంది.

కెరీర్‌ తొలినాళ్ల గురించి?

1984లో పరిశ్రమకి వచ్చాను. 1985లో శోభన్‌బాబు హీరోగా డ్రైవర్‌ బాబు` సినిమా తీశాను. జనవరి 1986లో సినిమా రిలీజైంది. మొదట ఈ సినిమాని సూపర్‌స్టార్‌ కృష్ణగారితో తీయానుకున్నా, కాల్షీట్ల సమస్య వ్ల తర్వాత శోభన్‌బాబుతో తెరకెక్కించాం. కెరీర్‌ తొలి సినిమానే చెప్పిన టైమ్‌కి రిలీజ్‌ చేశాం ఆరోజుల్లో. అది మరువలేని అనుభూతినిచ్చింది.

అప్పటికి ఇప్పటికి బడ్జెట్‌ విషయంలో కంట్రోల్‌ మారింది కదా!

1984 నుంచి 2005 వరకూ 15 సంవత్సరా కాంలో ఎన్నో సినిమాు చేశాం. నేను పరిశ్రమలోకి వస్తూనే పెద్ద సినిమాు చేశాను. శోభన్‌బాబుతో ఆరోజుల్లోనే 40క్షల్లో సినిమా అనుకుంటే బడ్జెట్‌ పరిధి మరో 10 నుంచి 20 క్షు పెరిగేది. అయినా అంత పెద్ద మొత్తం వసూళ్లు వచ్చేవి. అయితే ఛత్రపతి సినిమాని అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేయగలిగాం. టీమ్‌తో ప్రతిదీ మాట్లాడడం వ్ల బడ్జెట్‌ పరిధి దాటకుండా అదుపులో పెట్టుకోగలిగాం. ఇటీవలి కాంలోనూ బడ్జెట్‌ విషయంలో ప్రణాళికతోనే ఉంటున్నారంతా. అనుకోనిది ఏదైనా జరిగితే తప్ప అదనపు ఖర్చు ఏమీ లేదు. లిమిటేషన్‌ క్రాస్‌ చెయ్యడం అనేదేం లేదు.

ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో` విశేషాు?

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో షూటింగ్‌ 70శాతం పూర్తయింది. రియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో, శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కథ డిమాండ్‌ మేరకు ండన్‌, స్పెయిన్‌ లాంటి చోట తెరకెక్కిస్తున్నాం. ఈనె 20 నుంచి స్పెయిన్‌లో కొత్త షెడ్యూల్‌ మొదవుతోంది. ఎన్టీఆర్‌ అభిమానుకు ఇదో విజువల్‌ ట్రీట్‌ అవుతుంది. సుకుమార్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అంటూ ఇంటర్వ్యూ ముగించారు ఛత్రపతి` ప్రసాద్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment