ప్రతి పోలీసు కుటంబం చూడాల్సిన చిత్రం 'రాధ' - బివిఎస్ఎన్ ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందిన చిత్రం `రాధ`. సినిమా మే 12న విడుదలైన సందర్భంగా చిత్ర సమర్పకుడు బివిఎస్ఎన్ ప్రసాద్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.
బివిఎస్ఎన్ప్రసాద్ మాట్లాడుతూ - ``రాధ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఎంటర్టైన్మెంట్ బావుందని అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. అంతే కాకుండా పోలీస్ అంటే దేవుడు అనే మెసేజ్ కూడా ఇచ్చాం. ప్రతి పోలీస్ కుటుంబం చూడాల్సిన చిత్రం రాధ. పోలీసులు ఎంతో సర్వీస్ చేస్తున్నా వారికి విలువ తగ్గిపోతుంది. దాన్ని ఈ సినిమాలో చూపించాం. పోలీసు విలువను పెంచేలా సినిమాను చూశాం. శర్వానంద్ చక్కగా చేశాడు. కథ వినగానే శర్వానంద్‌కు నచ్చింది. తర్వాతే సినిమా చేయడానికి అంగీకరించాడు.
నిజానికి పోలీసులంటే దేవుళ్ళే. చాలా సందర్భాల్లో మనకు తెలియవు కానీ కొన్ని ఎట్మాస్పియర్స్లో ఆ విషయం మనకు తెలుస్తుంది. 24 గంటలు వారు మన కోసమే పనిచేస్తుంటారు. ఏ సందర్బంలో అయినా వారు సపోర్ట్ అవసరమే. దాన్ని ఎవరూ సరిగా గుర్తించలేదు. డైరెక్టర్ చంద్రమోహన్ కథ చెప్పడమే కాదు, సినిమాను కూడా చాలా చక్కగా తీశాడు. నిన్న సంధ్య థియేటర్ లో సినిమాను చూశాను. ప్రేక్షకులు బాగా రెస్పాన్స్ అవుతున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్‌కు కూడా స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నాం. కలెక్షన్స్ పరంగా సినిమా మంచి వసూళ్ళను సాధించింది. మరో పెద్ద హీరోతో సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకప్పుడు కథ, డ్రామా పై సినిమాలు సక్సెస్‌లు సాధించేది కానీ ఇప్పుడు సినిమాలు కథనం, విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారంగా రూపొందుతున్నాయి. అలాగే ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే అందరి పెద్ద హీరోలతో సినిమాలు అనుకుంటున్నాను. అందరితో తప్పకుండా సినిమాలు చేస్తాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments