close
Choose your channels

పవన్ అలా ఎందుకు చేసారో ఇప్పటికీ అర్ధం కావడం లేదు...అది నా దురదృష్టం - బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్

Wednesday, December 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఛ‌త్ర‌ప‌తి, డార్లింగ్, ఊస‌ర‌వెల్లి, సాహ‌సం, అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విజ‌య‌వంత‌మైన భారీ చిత్రాల‌ను నిర్మించిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ తాజాగా నిర్మించిన చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం చిత్రం ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
నాగేశ్వ‌ర‌రెడ్డితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాం. ఓరోజు ఒక లైన్ చెప్పాడు. క‌థ వినగానే బాగుంది ఈ క‌థ న‌రేష్ కి క‌రెక్ట్ గా స‌రిపోతుంది అనిపించింది. న‌రేష్ కూడా కథ విని ఓకే అన‌డంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం.
ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం సినిమా ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ ఉంటాయి. న‌రేష్ క్యారెక్ట‌ర్ చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. నిర్మాణప‌రంగా ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. సాయి కార్తీక్ మంచి ట్యూన్స్ అందించాడు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే మంచి సినిమా ఇది. పెద్ద సినిమాల‌ను ఎలా తీసామో ఈ చిత్రాన్ని కూడా అలాగే తీసాం.
నోట్ల ర‌ద్దు వ‌ల‌న ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది క‌దా..? దీని గురించి మీరేమంటారు..?
అత్తారింటికి దారేది సినిమా కూడా రిలీజ్ కి రెడీ అనుకుంటున్న టైమ్ లో ఆగిపోవ‌డం జ‌రిగింది. ఆ టైమ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ బాగా హెల్ప్ చేసారు. ఆత‌ర్వాత అత్తారింటికి దారేది రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే...న‌వంబ‌ర్ 8 రిలీజ్ అనుకున్నాం ఇంత‌లో 500, 1000 నోట్ల ర‌ద్దు అని ప్ర‌క‌టించ‌డం ఏత‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు కాస్త సెట్ అయ్యింది అనుకుంటున్నాను. దీంతో మా సినిమాకి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం.
మీ సినిమా రిలీజ్ ముందే ఇలాంటివి జ‌ర‌గ‌డం మీ సెంటిమెంట్ అనుకోవ‌చ్చా..?
ఇలాంటి సెంటిమెంట్ వ‌ద్దండి బాబు..! (న‌వ్వుతూ..)
అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి హెల్ప్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్...నాన్న‌కు ప్రేమ‌తో రిలీజ్ టైమ్ లో త‌న‌కు మీరు కొంత డ‌బ్బులు ఇవ్వాలంటూ అసోషియేష‌న్ లో ఫిర్యాదు చేసి నాన్న‌కు ప్రేమ‌తో రిలీజ్ కి అడ్డుప‌డ‌డానికి కార‌ణం..?
నేను కొంత ఎమౌంట్ ఇవ్వాలి అది ఆల‌స్యం అయ్యింది. అయినా.... అలా ఎందుకు జ‌రిగిందో నాకు ఇప్ప‌టికీ అర్ధం కావ‌డం లేదు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిమ్మ‌ల్ని అలా ఇబ్బంది పెట్టిన‌ప్పుడు ఏమ‌నిపించింది..?
ఆయ‌న ఇబ్బంది పెట్ట‌లేదు...నేను ఇబ్బంది ప‌డ్డాను అంతే..!
ఆ టైమ్ లో మీ ఆలోచ‌న ఎలా ఉంది..?
అది ఎందుకు జ‌రిగిందో అలా జ‌రిగిపోయింది. నేను ఆ టైమ్ లో అలాంటి ప‌రిస్ధితిలో ఉండ‌డం నా దుర‌దృష్టం అనుకుంటున్నాను.
ఈ సంవ‌త్స‌రం బిగినింగ్ లో నాన్న‌కు ప్రేమ‌తో...ఎండింగ్ లో ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం రిలీజ్ చేస్తున్నారు..!
అవును..! ఈ ఇయ‌ర్ బిగినింగ్ లో నాన్న‌కు ప్రేమ‌తో సెంటిమెంట్...ఎండింగ్ లో ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం ఎంట‌ర్ టైన్మెంట్..! అనుకోకుండా ఇలా జ‌రిగింది.
ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హ‌ర్ర‌ర్ మూవీస్ వ‌చ్చాయి క‌దా..! ఈ సినిమాలో ఉన్న కొత్త‌ద‌నం ఏమిటి..?
మీర‌న్న‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హ‌ర్ర‌ర్ మూవీస్ వ‌చ్చాయి. కాక‌పోతే మా సినిమాలో ఫ్యామిలీ చూసే విధంగా ఉండే ఫ్యామిలీ హ‌ర్ర‌ర్ ఇది. అంద‌రికీ న‌చ్చుతుంది.
డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి వ‌ర్కింగ్ స్టైల్ ఎలా ఉంది..?
నాగేశ్వ‌ర‌రెడ్డి చాలా మంచి డైరెక్ట‌ర్. పెద్ద సినిమాలును కూడా బాగా డీల్ చేయ‌గ‌ల‌డు. దేనికైనారెడీ సినిమాని చాలా బాగా తీసాడు. ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లాల్సిన డైరెక్ట‌ర్. ఈ సినిమాతో నాగేశ్వ‌ర‌రెడ్డికి మరింత పేరు వ‌స్తుంది.
ఇ.వి.వి గారితో సినిమాలు తీసిన మీరు ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ తో సినిమా చేయ‌డం గురించి..?
ఇ.వి.వి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇ.వి.వి గారితో సినిమాలు తీస్తున్న‌ప్పుడు న‌రేష్ చిన్న‌పిల్లోడు. ఇప్పుడు న‌రేష్ హీరో అవ్వ‌డం..నేను న‌రేష్ తో సినిమా తీయ‌డం హ్యాపీగా ఫీల‌వుతున్నాను.
32 సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో ఉన్నారు క‌దా..! ఇండ‌స్ట్రీలో మీరు ఏం నేర్చుకున్నారు..?
పెద్ద సినిమాలు, చిన్న‌సినిమాలు తీస్తూ 32 సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. అప్ప‌టి నుంచి ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ తో కూడా సినిమాలు తీస్తున్నాను. ఇది నాకు దేవుడు ఇచ్చిన వ‌రం. నాకు ఇంకో వ్యాపారం లేదు తెలియ‌దు. సినిమా అంటే ఇష్టం. ఓపిక ఉన్నంత వ‌ర‌కు సినిమాలు తీస్తూనే ఉంటాను. ఏం నేర్చుకున్నారు అంటే...ఇంత‌కు ముందు అన్నారు క‌దా నాన్న‌కు ప్రేమ‌తో రిలీజ్ టైమ్ లో ఇబ్బంది ప‌డ్డారా...అని అలాంటివి జ‌రుగుతుంటాయి అని జాగ్ర‌త్తగా ఉంటూ ముందుకు వెళ్లాలి అని తెలుసుకున్నాను.
శ‌ర్వానంద్ తో సినిమా నిర్మిస్తున్నారు క‌దా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..!
ప్యాచ్ వ‌ర్క్ & సాంగ్స్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.
2017లో మీ ప్లానింగ్ ఏమిటి..?
అనుకున్న‌వి జ‌ర‌గ‌డం లేదు అందుచేత ఇది ప్లానింగ్ అని చెప్ప‌డం క‌రెక్ట్ కాదు అని నా ఫీలింగ్. అయినా చెబుతున్నాను వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment