Butta Bomma: 26, జనవరి 2023 'బుట్ట బొమ్మ' విడుదల

  • IndiaGlitz, [Saturday,December 17 2022]

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల తో 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘...బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ గా అనిక సురేంద్రన్ అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం బుట్ట బొమ్మ ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న బుట్ట బొమ్మ విడుదల తేదీ ప్రచార చిత్రం ను ఈ రోజు అధికారికంగా సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే... ఆకట్టుకోవడంతో పాటు, ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ... ‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.

చిత్రం లోని ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం కథానుగుణంగా ఆకట్టుకుంటుంది. అలాగే పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. వీటితో పాటు వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు. సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో తనదైన బాణీ పలికించటానికి ఆయన పడే తపన ఈ చిత్రంలో స్పష్టమవుతుంది.

చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26 న విడుదల అవుతున్న ఈ చిత్రం సినీ అభిమాన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, అలరిస్తుందని తెలిపారు నిర్మాతలు.

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు.

More News

Venkaiah Naidu: తానా వారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలను సన్మానించడం ఎంతో అభినందనీయం : వెంకయ్య నాయుడు

ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ  తెలుగు వారి కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటైన ప్రసిద్ధి సంస్థ 'ఉత్తర అమెరికా తెలుగు సంఘం'

Waltair Veerayya:'వాల్తేరు వీరయ్య' సెకండ్ సింగిల్ 'నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి' డిసెంబర్ 19న విడుదల

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు,

BiggBoss6: బకరాలైన కంటెస్టెంట్స్... కీర్తి సేవ్, మిడ్‌వీక్ ఎలిమినేట్ అయిన శ్రీసత్య

బిగ్‌బాస్ 6 తెలుగులో నాగార్జున (King Nagarjuna) చెప్పినట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది.

Rewind 2022: పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన 5 చిత్రాలివే...

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశస్తులు ఇదే నిజమని నమ్మేవారు.

BiggBoss6:మిడ్‌వీక్ ఎలిమినేట్ అయ్యేది శ్రీసత్యేనా... సోషల్ మీడియాలో డిస్కషన్, సస్పెన్స్ కంటిన్యూ

బిగ్‌బాస్ 6 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.