అయినా సరే.. చెర్రీ వదలడం లేదు

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

ఒక‌టికి రెండుసార్లు త‌న‌కు క‌లిసి రాక‌పోయినా స‌రే అదే ప‌ని మూడోసారి చేయ‌బోతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఇంత‌కీ అదేమిటంటే.. త‌న‌కు అచ్చిరాని అక్టోబ‌ర్ నెల‌లో వ‌రుస‌గా మూడోసారి సంద‌డి చేయ‌నుండ‌డం. 2014లో 'గోవిందుడు అంద‌రివాడేలే' తో త‌న కెరీర్‌లోనే తొలిసారిగా అక్టోబ‌ర్ నెల‌లో సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. ఆ సినిమా ఫ‌లితం అంతంత‌మాత్రంగానే తేలింది.

ఆ చిత్రం త‌రువాత చెర్రీ హీరోగా చేసిన 'బ్రూస్‌లీ' కూడా ఏడాది విరామం తీసుకుని అదే అక్టోబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌లితం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి అదే నెల‌పై కొత్త చిత్రంతో దండ‌యాత్ర చేయ‌బోతున్నాడు చెర్రీ. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన 'త‌ని ఒరువ‌న్‌'కి రీమేక్‌గా రానున్న ఆ చిత్రమైనా చ‌ర‌ణ్‌కి అక్టోబ‌ర్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి హిట్‌నిస్తుందేమో చూడాలి.

More News

'అ..ఆ..'ఆ లిస్ట్ లో చేరుతుందట

లేడీలక్ సమంతకి తెలుగులో సింహభాగం విజయాలున్నాయి.అయితే వాటిలో ఆమెకి నటన పరంగా పేరు తెచ్చిన చిత్రాలంటే 'ఏమాయ చేసావే','మనం'మాత్రమే.

ఇక నుంచి నేను ఏ సినిమా చేసినా అదిరిపోయింది అనే మాట వస్తుంది ఇది గ్యారెంటీ - హీరో సందీప్ కిషన్

స్నేహగీతం,ప్రస్ధానం,వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,గుండెల్లో గోదారి,బీరువా,టైగర్,రన్...ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్.

చిరు 150 - బాల‌య్య 100 - వెంకీ 75.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం, బాల‌య్య 100వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభమైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు విక్టరీ వెంక‌టేష్ 75వ చిత్రం కోసం రెడీ అవుతుండ‌డం విశేషం.

'నేనోరకం' టీజర్ టాక్...

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం.చిత్రీకరణ పూర్తి చేసుకొంది.సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ తో మూడోసారీ మార్చేసాడు

పవన్ కళ్యాణ్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న తొలి దర్శకుడుగా క్రెడిట్ సొంతం చేసుకున్నాడు