యాడ్ షూట్ తో బిజీ
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోని అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్. ఇప్పుడు తన రెండో సినిమాపై అచి తూచి అడుగులేస్తున్నాడు. హను రాఘవపూడితో సినిమా అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. హను రాఘవపూడి ఆ సినిమాను ఇప్పుడు నితిన్‌తో చేస్తున్నాడు.
అయితే అఖిల్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా తన నెక్ట్స్ మూవీని విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు అఖిల్ మౌంట్ డ్యూ యాడ్‌లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఒకవైపు అఖిల్ షూట్స్, ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. అక్కినేని అభిమానులు అఖిల్ తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments