'బిజినెస్ మేన్' నుంచి 'సర్దార్' వరకు..

  • IndiaGlitz, [Saturday,October 17 2015]

నాలుగైదు ఏళ్ల కిత్రం వ‌ర‌కు ఏడాదికి మూడు నాలుగు సినిమాల‌తో బిజీ బిజీగా క‌నిపించేది కాజ‌ల్‌. ఉన్న‌ట్టుండి ఏమ‌నుకుందో ఏమో.. 2012 నుంచి త‌న శైలిని మార్చేసింది. ఏడాదికి ఒక‌టి లేదా రెండు సినిమాల‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. ఇక అంత‌కుముందులా మ‌రీ కుర్ర హీరోల‌తో సినిమాలు చేయ‌డం లేదు. చేస్తే టాప్ స్టార్స్ తోనే సినిమాలు.. లేదంటే ఖాళీగా ఉండ‌టానికే త‌న ప్ర‌యారిటీ అన్న‌ట్లుగా త‌యార‌యింది కాజ‌ల్‌.

అయితే ఈ ప‌రిస్థితి తెలుగు సినిమాల‌కే ప‌రిమితం కావ‌డం విశేషం. 'బిజినెస్‌మేన్' ద‌గ్గ‌ర్నుంచి కాజ‌ల్ చేసిన తెలుగు సినిమాల‌ను ప‌రిశీలిస్తే.. 'సారొచ్చారు, నాయ‌క్‌, బాద్‌షా, ఎవ‌డు, గోవిందుడు అంద‌రివాడేలే, టెంప‌ర్‌'.. ఇవ‌న్నీ టాలీవుడ్ టాప్‌స్టార్‌ల సినిమాలే. ఇక కొత్త‌గా చేస్తున్న 'బ్ర‌హ్మోత్స‌వం', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'లు కూడా అంతే. వీటిలో మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న కాజ‌ల్‌ న‌టిస్తోంది. ఈ లెక్క‌న‌.. కాజ‌ల్ అంటే అగ్ర క‌థానాయ‌కుల‌కే ప‌రిమితం అనే ప‌రిస్థితి నాలుగైదు సంవ‌త్స‌రాలుగా ఏర్ప‌డింది. ఏదేమైనా కాజ‌ల్ బాణీ సాటి టాప్ హీరోయిన్ల కంటే భిన్నంగా ఉంద‌న్న‌ది మాత్రం నిజం.

More News

'కంచె'కి అదో ప్లస్....

చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలిలో ఓ సెంటిమెంట్ బలంగా పెరుగుతోంది.అదేమిటంటే..ఆ కుటుంబ హీరోల రెండో చిత్రాలు మంచి విజయాలు సాధిస్తాయన్నది.

బ్లాక్ బస్టర్స్ మైలురాయికి చేరుకున్నాయ్

ఈ మధ్యకాలంలో దక్షిణాదిన బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే..''బాహుబలి'','శ్రీమంతుడు','తని ఒరువన్'.ఈ మూడు చిత్రాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

ఓవర్ సీస్ లో 'బ్రూస్ లీ' కి హయ్యస్ట్ ఓపెనింగ్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం బ్రూస్ లీ.డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య బ్రూస్ లీ సినిమాని నిర్మించారు.

అంజలి పని బాగుంది

తొమ్మిదేళ్ల క్రితం తెలుగు హీరోయిన్ గా రాణించేందుకు చాలానే కష్టపడింది తెలుగమ్మాయి అంజలి.అయితే..అప్పుడు ఆమె ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు.

ముస్లీం అమ్మాయిగా సమంత?

తెలుగులో చేసిన తొలి చిత్రం 'ఏమాయ చేసావె'కోసం క్రిస్టియన్ గర్ల్ జెస్సీగా విశేషంగా ఆకట్టుకుంది అందాల నటి సమంత.ఆ తరువాత పలు చిత్రాల్లో హిందూ అమ్మాయిగా కనువిందు చేసింది.