'బిజినెస్ మేన్' నుంచి 'సర్దార్' వరకు..
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగైదు ఏళ్ల కిత్రం వరకు ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బిజీ బిజీగా కనిపించేది కాజల్. ఉన్నట్టుండి ఏమనుకుందో ఏమో.. 2012 నుంచి తన శైలిని మార్చేసింది. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక అంతకుముందులా మరీ కుర్ర హీరోలతో సినిమాలు చేయడం లేదు. చేస్తే టాప్ స్టార్స్ తోనే సినిమాలు.. లేదంటే ఖాళీగా ఉండటానికే తన ప్రయారిటీ అన్నట్లుగా తయారయింది కాజల్.
అయితే ఈ పరిస్థితి తెలుగు సినిమాలకే పరిమితం కావడం విశేషం. 'బిజినెస్‌మేన్' దగ్గర్నుంచి కాజల్ చేసిన తెలుగు సినిమాలను పరిశీలిస్తే.. 'సారొచ్చారు, నాయక్, బాద్‌షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్'.. ఇవన్నీ టాలీవుడ్ టాప్‌స్టార్‌ల సినిమాలే. ఇక కొత్తగా చేస్తున్న 'బ్రహ్మోత్సవం', 'సర్దార్ గబ్బర్ సింగ్'లు కూడా అంతే. వీటిలో మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్ పక్కన కాజల్ నటిస్తోంది. ఈ లెక్కన.. కాజల్ అంటే అగ్ర కథానాయకులకే పరిమితం అనే పరిస్థితి నాలుగైదు సంవత్సరాలుగా ఏర్పడింది. ఏదేమైనా కాజల్ బాణీ సాటి టాప్ హీరోయిన్ల కంటే భిన్నంగా ఉందన్నది మాత్రం నిజం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments