Pushpa 2: పుష్ప 2 యూనిట్‌తో వస్తున్న బస్సుకు ప్రమాదం.. ఆర్టిస్టులకు గాయాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా పుష్ప పేరు బాగా వినిపించింది. వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా చిన్నారులైతే మెడ కిందగా చేతులు పోనిస్తూ నానా అల్లరి చేస్తున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నాయి. పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఇంతటి ప్రభంజనం సృష్టించిన పుష్పకి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ శివార్లలో ప్రమాదం:
ప్రస్తుతం పుష్ప 2ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లిలో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. అక్కడ షెడ్యూల్ ముగించుకుని యూనిట్ సభ్యులు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో నగర శివార్లలో బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఇందులో ప్రధాన తారాగణం ఎవ్వరూ లేరు. కేవలం జూనియర్ ఆర్టిస్టులు, మిగతా యూనిట్ సభ్యులు మాత్రమే సదరు బస్సులో వున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన వీరిని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు.
పుష్ప 1 సమయంలో అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం:
అయితే గతంలో పుష్ప పార్ట్ 1 సమయంలోనూ హీరో అల్లు అర్జున్‌కు చెందిన కార్‌వాన్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరి 6న రాజమండ్రి, మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న కార్‌వాన్‌ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ అందులో లేరు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments