బుర్రకథ హీరోయిన్ అరెస్ట్.. స్నేహితుడితో కలసి గంజాయి తీసుకుంటూ..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరోయిన్ నైరా షాని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది. నైరా షా గంజాయి తీసుకుంటుండగా అధికారులు ఆమెని అరెస్ట్ చేశారు. దీనితో సెలెబ్రిటీల విషయంలో డ్రగ్స్ కేసుపై మరోసారి చర్చ మొదలైంది. పక్కా సమాచారంతో ఆమె ఉంటున్న హోటల్ రూమ్ ని నార్కోటిక్స్ అధికారులు రైడ్ చేశారు.
ఇదీ చదవండి: నితిన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి డెబ్యూ డైరెక్టర్ తో..
ముంబైలోని జుహు ప్రాంతంలో ఓ హోటల్ లో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందగానే వేగంగా రైడ్ చేసిన నార్కోటిక్స్ అధికారులు నైరా షా, ఆమె స్నేహితుడు ఆషిక్ సాజిద్ లని అరెస్ట్ చేశారు. ఇద్దరూ హోటల్ రూమ్ లో ఉంటూ గంజాయి తీసుకుంటున్నారు.
వారిద్దరూ ఉంటున్న రూమ్ ని తనిఖీ చేయగా సిగరెట్ లో చుట్టిన గ్రాము గంజాయి బయటపడింది. ఆదివారం నైరా షా తన పుట్టినరోజు సందర్భంగా అదే హోటల్ లో పార్టీ నిర్వహించింది. పార్టీ పూర్తయ్యాక తన స్నేహితుడు ఆషిక్ తో కలసి హోటల్ రూమ్ కి వెళ్లారు. అప్పడే వీరిద్దరూ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించారు.
పోలీసులు అందించిన సమాచారం మేరకు బర్త్ డే పార్టీలో కూడా నైరా షా కొన్ని నిషేదించిన డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వెంటనే వీరిద్దరిని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ కలసి డ్రగ్స్ సేవించడమే కాక డ్రగ్స్ దందా సాగిస్తున్నారా అనే కోణంలో విచారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐపీసీ సెక్షన్ 274కింద వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైరా షా రెండేళ్ల క్రితం హీరో ఆది సరసన బుర్రకథ అనే చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments