డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ బుర్ర‌క‌థ‌

  • IndiaGlitz, [Monday,May 06 2019]

ఆది సాయికుమార్, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి జంట‌గా న‌టిస్తున్న చిత్రం బుర్ర‌క‌థ‌. పిల్లా నువ్వులేని జీవితం, ఈడో ర‌కం, ఆడో ర‌కం సినిమాల‌తో ర‌చ‌యిత‌గా పెద్ద విజ‌యాల్ని అందుకున్న డైమండ్ ర‌త్న‌బాబు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. దీపాల ఆర్ట్స్ ప‌తాకంపై బీర‌మ్ సుధాక‌ర్‌రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌కాంత్ దీపాలా, కిషోర్ నిర్మిస్తున్నారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, నైరాషా కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్‌భూప‌తి విడుద‌ల‌చేశారు. టీజ‌ర్‌ను ద‌ర్శ‌కులు అజ‌య్‌భూప‌తి, శివ‌నిర్వాణ ఆవిష్క‌రించారు.

శివ‌నిర్వాణ మాట్లాడుతూ నేను ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన త‌ర్వాత తొలుత ప‌రిచ‌యం అయిన వ్య‌క్తి ర‌త్న‌బాబు. ద‌ర్శ‌కుడికి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌తో పాటు సంభాష‌ణ‌ల రాయ‌డంలో పరిజ్ఞానం ఉండాల‌ని ఆయ‌న వ‌ద్దే నేర్చుకున్నాను. బుర్ర‌క‌థ టైటిల్ బాగుంది. ఏపీ తెలంగాణ‌లో ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. డైలాగ్‌లు బాగున్నాయి. ఆది కామెడీ టైమింగ్ బాడీలాంగ్వేజ్‌ అద్భుతంగా ఉంది అని తెలిపారు.

అజ‌య్‌భూప‌తి మాట్లాడుతూ తొలి సినిమా ఏ ద‌ర్శ‌కుడికైనా ముఖ్యం. నేను శివ‌నిర్వాణ తొలి సినిమా అడ్డంకిని విజ‌య‌వంతంగా దాటివ‌చ్చాం. ఇప్పుడు డైమండ్ ర‌త్న‌బాబు వంతు మిగిలివుంది. కొత్త‌గా వ‌చ్చే ద‌ర్శ‌కుల‌కు ఆది డైమండ్ లాంటి ద‌ర్శ‌కుడు. సినిమాతో హిట్టుకొట్టిన ద‌ర్శ‌కుల జాబితాల‌తో అత‌డు నిల‌వాలి. యాక్ష‌న్‌, కామెడీ, థ్రిల్ల‌ర్ ఏ క‌థ‌కైనా స‌రిపోగ‌ల న‌టుడు ఆది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. టీజ‌ర్‌, డైలాగ్‌లు బాగున్నాయి అని తెలిపారు.

ఏ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ మ‌రుధూరి రాజా త‌ర్వాత నాకు బాగా ఇష్ట‌మైన సంభాష‌ణ‌ల ర‌చ‌యిత ర‌త్న‌బాబు. నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పిల్లా నువ్వు లేని జీవితం విజ‌యంలో మూల‌స్తంభంలా ర‌త్న‌బాబు నిలిచాడు. మంచి బుర్ర ఉన్న వ్య‌క్తి. ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని తెచ్చిపెట్టాలి. పిల్లా నువ్వులేని జీవితం సినిమా ఆదితో చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు అని అన్నారు.

డైమండ్ ర‌త్న‌బాబు మాట్లాడుతూ రెండు బ్రెయిన్‌లు ఉన్న ఓ యువ‌కుడి క‌థ ఇది. ఆ పాయింట్‌లో నుంచే వినోదం ప‌డుతుంది. రామ్‌, అభి పాత్ర‌లు విభిన్నంగా ఉంటాయి. ఆది ఈ పాత్ర‌ల‌కు వెయ్యి శాతం న్యాయం చేశాడు. తెనాలి రామ‌లింగ‌డి త‌ర‌హా పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపిస్తారు. ఫ‌స్ట్‌కాపీ త‌ర్వ‌లో రెడీ అవుతుంది. సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అని తెలిపారు.

నిర్మాత శ్రీ‌కాంత్ మాట్టాడుతూ ర‌త్న‌బాబు చాలా క‌ష్ట‌ప‌డి రాసుకున్న క‌థ ఇది. సినిమా చూశాం. బాగా వ‌చ్చింది. తాను ఏం చెప్పారో దానిని స్ర్కీన్‌పై చూపించారు. ఆది చ‌క్క‌టి ఇన్‌పుట్స్ ఇచ్చాడు. చాలా స‌పోర్ట్ చేశాడు. అత‌డి కామెడీ టైమింగ్ బాగుంటుంది. జూన్ మొద‌టివారంలో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం అని అన్నారు.

ఆది మాట్లాడుతూ డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అభి, రామ్ పాత్ర‌ల‌తో పాటు క‌థ విన‌గానే చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోష‌న్ ఉంటుంది. క్టైమాక్స్ బాగుంటుంది. డైలాగ్స్ బాగుంటాయి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ల‌వ్‌లీ, శ‌మంత‌క‌మ‌ణి సినిమాలు చేశాను. మ‌ళ్లీ సినిమాలో ఆయ‌న‌తో న‌టించాను. . నా పాత్ర ఎలా చేయాల‌నే విష‌యంలో చాలా స‌ల‌హాలు ఇచ్చారు. నేను బాగా న‌టించ‌డానికి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ర‌త్న‌బాబు కార‌ణం అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో సాయికార్తీక్‌, గాయ‌త్రి గుప్తా, మ‌ణిచంద‌న్‌, యూసూఫ్‌, కిషోర్‌తో పాటు చిత్ర‌బృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రామ్‌ప్ర‌సాద్‌, ఎడిట‌ర్-య‌మ్‌.ఆర్‌.వ‌ర్మ, పాట‌లు భాస్క‌ర‌భ‌ట్ల‌, కెకె కృష్ణ‌కాంత్‌, ర‌త్న‌బాబు, ఫైట్స్ సాల్మ‌న్‌రాజ్‌, వెంక‌ట్ మాస్ట‌ర్‌, రాబిన్ సుబ్బు, రియ‌ల్ స‌తీష్‌