శ్రీలంకలో బుర్ఖా పై నిషేధం.. ఎందుకంటే...!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు 300మందికి పైగా ఈ పేలుళ్లలో మరణించగా అంతకు రెట్టింపు మంది క్షతగాత్రులై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ బురఖాలు దరించరాదని ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కాగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో ఉంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే దానికి వివరణ కూడా ఇచ్చుకుంది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని తెలిపారు.
కాగా.. అత్యవసర నిబంధనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిరిసేన తెలిపారు. ఇదంతా ప్రజా రక్షణ కోసమే అమలు చేస్తున్నామని మైత్రిపాల సిరిసేన చెప్పుకొచ్చారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా ఉండి నిందితులను త్వరగా గుర్తించేందుకే బుర్ఖాను నిషేధించాలని నిర్ణయించామన్నారు. అయితే శ్రీలంక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ముస్లీం పెద్దలు, నేతలు కూడా అంగీకరించడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com