Bunny Vasu:సిగ్గు, లజ్జ వదిలేస్తేనే రండి.. బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
జీఏ2 బ్యానర్‌పై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన 'కోటబొమ్మాళి' పీఎస్ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధానపాత్రలో కనిపించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకుంటుందనే నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. మూవీ ప్రమోషన్లో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలపై బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు చేశారు.
"బాగా చదువుకుని, బాగా సంపాదిస్తే, ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. అంతేతప్ప రాజకీయాల్లోకి రాకండి. ఈ రోజు ఉన్న రాజకీయాల్లోకి ఒక వ్యక్తి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేయాలి. నన్ను ఎవడు తిట్టినా ఫర్వాలేదు. నా ఫ్యామిలీ ఫోటోలు ఎవడు సోషల్ మీడియాలో పెట్టిన ఫర్వాలేదు. నా ఫ్యామిలీని, కూతురును, భార్యను ఎవరు ఏమన్నా ఫర్వాలేదు. నాకేం పట్టదు అని బట్టలు విప్పి రోడ్డు మీద నడవగలిగిన వాడే ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్లగలడు. చదువుకున్న వారు, ఆత్మాభిమానం ఉన్నవారు, చిన్న మాట అంటే పడని వారు మాత్రం రాజకీయాలకు సూట్ కారు. ఒకవేళ నేను పోటీ చేయాలి అనుకుంటే నేనూ అన్నింటిని వదిలేయాల్సిందే. లేదంటే ఇంట్లో కూర్చొవడం బెస్ట్" అని తెలిపారు. ప్రస్తుతం బన్నీ వాసు వ్యాఖ్యలు సోష్ల మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏపీలోని కోనసీమ జిల్లా పాలకొల్లుకు చెందిన బన్నీ వాసు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో జనసేన పార్టీకి తన మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout