తమిళంలో బన్ని మరో ప్రయత్నం...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగువాడైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెన్నైలో పుట్టి పెరిగాడు. తమిళంపై మంచి కమాండ్ కూడా ఉంది. హీరోగా బన్నికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉన్న బన్ని.. తన మార్కెట్ పరిధిని తమిళంలో కూడా పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందుకోసం రెండేళ్ల ముందు తెలుగు, తమిళ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు బన్ని మరోసారి తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్ని సిద్ధమవుతున్నట్లు టాక్.
అజిత్‌తో సినిమాలు ఎక్కువగా చేసిన శివ తెలుగులో కూడా గోపీచంద్ శౌర్యం, శంఖం.. రవితేజతో దరువు సినిమాలు చేశాడు. ఈ దర్శకుడితో బన్ని సినిమా అంటే పక్కా కమర్షియల్ అంశాలతోనే సినిమా ఉంటుంది. దీని గురించి త్వరలోనే వివరాలు తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com