నయనతార నిర్ణయంతో షాకైన బన్ని..
- IndiaGlitz, [Friday,July 08 2016]
అందాల తార నయనతార శింబు, ప్రభుదేవా లతో లవ్ పడడం...ఆతర్వాత వాళ్లతో నయనతార లవ్ బ్రేక్ అప్ అవ్వడం తెలిసిందే. రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అయిన నయనతార ఇక ప్రేమలో పడదు అనుకున్నారు. కానీ...అందరి అంచనాలను తారుమారు చేస్తూ నయనతార డైరెక్టర్ విఘ్నేష్ తో ప్రేమ ప్రయాణం సాగిస్తుంది.
నయనతార ఎక్కడికి వెళితే అక్కడికి విఘ్నేష్ ని తీసుకువెళుతుంది. సైమా వేడుకలకు కూడా నయన్ - విఘ్నేష్ ఇద్దరు కలిసే వెళ్లారు. ఇక అసలు విషయానికి వస్తే...సైమా అవార్డ్స్ లో ఓ తమిళ చిత్రంలో నటనకు గాను ఉత్తమనటిగా నయనతారను ఎంపిక చేసారు.ఈ అవార్డ్ తీసుకునేందుకు నయనతారను వేదిక పైకి పిలిచారు. అలాగే ఈ అవార్డ్ అందించేందుకు బన్నిని పిలిచారట. ఇక బన్ని నయనతారకు అవార్డ్ అందచేయనున్నాడు అనగా నయనతార నాకు బన్ని చేతుల మీదుగా వద్దు...డైరెక్టర్ విఘ్నేష్ చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవాలనుకుంటున్నాను అని విఘ్నేష్ ని స్టేజ్ పైకి పిలిచిందట. నయనతార నిర్ణయానికి షాకైన బన్ని ఏం చేయాలోతెలియక అలా ఉండిపోయాడట. ఈ స్టిల్ చూడండి మీకే తెలుస్తుంది...నయనతార నిర్ణయానికి బన్ని ఎంతగా ఇబ్బంది పడ్డాడో...