ముదురుతున్న బన్ని - పవన్ వివాదం..
- IndiaGlitz, [Monday,May 16 2016]
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సరైనోడు. ఈ చిత్రం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇటీవల సరైనోడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతుంటుంటే.... ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి అన్నారట. వెంటనే...అల్లు అర్జున్ పవన్ గురించి చెప్పను బ్రదర్ అని సమాధానం ఇచ్చారట. అక్కడున్న అభిమానులకు, మీడియాకి మెగా హీరో పవన్ గురించి బన్ని అలా ఎందుకు అన్నారో అర్థం కాలేదు.
ఈ విషయం గురించి తెలుసుకున్న సినీ మీడియా హైదరాబాద్ వచ్చిన తర్వాత బన్నిని ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే...బన్ని నుంచి మళ్లీ అదే సమాధానం చెప్పను బ్రదర్. మెగా ఫ్యాన్స్ కి ఎందుకు బన్ని ఇలా మాట్లాడాడో అర్ధం కాక తెగ టెన్షన్ పడుతున్నారట. ఇదిలా ఉంటే...పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ కి వ్యతిరేకంగా చూసుకుంటాం బ్రదర్ అంటున్నారు. దీంతో బన్ని - పవన్ వివాదం మరింత ముదురుతుంది అని తెలుస్తుంది. మరి...ఈ వివాదం ఎక్కడ వరకు వెళుతుందో..? ఎక్కడ ఎండ్ అవుతుందో..?