Pushpa 2:పుష్ప2 నుంచి చీరలో బన్నీ గెటప్ లీక్.. దర్శకుడు సుకుమార్ సీరియస్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. మూవీలో బన్నీ యాక్టింగ్, తగ్గేదేలే మేనరిజం, డ్యాన్సులకు అందరూ ఈలలు వేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో 69 సంవత్సరాల జాతీయ అవార్డుల్లో తొలిసారి తెలుగు నటుడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలు నిలబెట్టుకునేలా ఈ సినిమాను జాగ్రత్తగా తీస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అమ్మవారి గెటప్‌లో చీర కట్టుకున్న ఫొటో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి బన్నీ చీర కట్టుకొని కూర్చున్న ఫోటో ఒకటి లీక్ అయి వైరల్ అవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్‌లో ఓ ఫైట్, సాంగ్ ఉందని సమాచారం. జాతరకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయని టాక్. ఇప్పుడు ఆ సీన్స్‌కు సంబంధించిన స్టిల్‌నే లీక్ కావడంతో సినిమా యూనిట్‌పై సుకుమార్, నిర్మాతలు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇదిలా ఉంటే పుష్పా గాడి జాతర చూడాలంటే ఇంకా రెండు వందల రోజులు వెయిట్ చేయాలంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తుండగా... ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మి్స్తున్నారు. రాక్‌స్టార్ డీఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments