చిరు కి టార్గెట్ ఫిక్స్ చేసిన బన్ని..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమిళ్ లో ఘన విజయం సాధించిన కత్తి సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. చాలా గ్యాప్ తరువాత చిరంజీవి హీరోగా నటిస్తుండడం...ఈ చిత్రం చిరుకి 150వ చిత్రం కావడం...తో ఈ మూవీ పై భారీ అంచనాలు సహజం.
అయితే...బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించి ఒకటి, రెండు స్ధానాలు దక్కించుకున్నాయి. మరి..చిరు ప్రజెంట్ యూత్ ను ఆకట్టుకోగలరా..? చిరు 150వ చిత్రం ఈ రెండు స్ధానాలును క్రాస్ చేస్తుందా..? అసలు ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే...బన్ని చిరుకి టార్గెట్ ఫిక్స్ చేసేసాడు. సరైనోడు సక్సెస్ మీట్ లో బన్ని మాట్లాడుతూ...చిరంజీవి గారి 150వ సినిమా 150 కోట్లు షేర్ సాధిస్తుంది చూడండి అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. బన్ని మాటలు నిజం అవుతాయో...లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com