చిరు కి టార్గెట్ ఫిక్స్ చేసిన బ‌న్ని..

  • IndiaGlitz, [Monday,May 16 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన కత్తి సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. చాలా గ్యాప్ త‌రువాత చిరంజీవి హీరోగా న‌టిస్తుండ‌డం...ఈ చిత్రం చిరుకి 150వ చిత్రం కావ‌డం...తో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు స‌హ‌జం.

అయితే...బాహుబ‌లి, శ్రీమంతుడు చిత్రాలు తెలుగులో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించి ఒక‌టి, రెండు స్ధానాలు ద‌క్కించుకున్నాయి. మ‌రి..చిరు ప్ర‌జెంట్ యూత్ ను ఆక‌ట్టుకోగ‌ల‌రా..? చిరు 150వ చిత్రం ఈ రెండు స్ధానాలును క్రాస్ చేస్తుందా..? అస‌లు ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే...బ‌న్ని చిరుకి టార్గెట్ ఫిక్స్ చేసేసాడు. స‌రైనోడు స‌క్సెస్ మీట్ లో బ‌న్ని మాట్లాడుతూ...చిరంజీవి గారి 150వ సినిమా 150 కోట్లు షేర్ సాధిస్తుంది చూడండి అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. బ‌న్ని మాట‌లు నిజం అవుతాయో...లేదో చూడాలి.

More News

బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డే ప్లానింగ్ సూప‌ర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. మ‌హేష్ స‌ర‌స‌న కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత న‌టించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన బ్ర‌హ్మోత్స‌వం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

24 మూవీకి మ‌హేష్ నో చెప్ప‌డానికి రీజ‌న్ ఇదే..

సూర్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 24. ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ చిత్ర క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ముందుగా మ‌హేష్ కి చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ముదురుతున్న బ‌న్ని - ప‌వ‌న్ వివాదం..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రం సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల స‌రైనోడు స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ప్రభాస్ కి లేఖ రాసిన కెన్యా గవర్నర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

చిన్నప్పటి చైతు సూపర్..

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.