మహేష్ మూవీకి భారీ ఆఫర్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ్ లో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. అయితే....ఈ భారీ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు కానీ..అప్పుడే ఈ మూవీకి రిలయన్స్ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట.
కేవలం తెలుగు, తమిళ్ థియేట్రికల్ రైట్స్ కే రిలయన్స్ సంస్థ 150 కోట్లు ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి కానీ...థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ తో సహా అన్నీ కలుపుకునే ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రిలయన్స్ ఇచ్చిన ఆఫర్ గురించి మహేష్ బాబు, మురుగుదాస్, నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు మధ్య చర్చలు జరుగుతున్నాయట. మహేష్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తుండడం, మురుగుదాస్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం ఇంత భారీ ఆఫర్ రావడానికి కారణం అని టాక్. మరి..రిలయన్స్ ఆఫర్ కి ఎస్ చెబుతారో...నో చెబుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout