బర్త్ డే నాడు కీర్తి సురేష్ కు బంపర్ ఆఫర్..!
Monday, October 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నానితో నేను లోకల్ మూవీలో నటిస్తుంది. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ బర్త్ డేకి కీర్తి సురేష్ కి సూర్య బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అది ఏమిటంటే... విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో సూర్య ఓ చిత్రం చేస్తున్నారు.
ఈ చిత్రానికి తానే సేరంధ కూట్టం టైటిల్ కన్ ఫర్మ్ చేసారు. అయితే...ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ నయనతారతో పాటు చాలా మంది పేరు వినిపించాయి. ఫైనల్ గా ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్ ను ఫైనల్ చేసారు. పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ కి బర్త్ డే విషెస్ చెప్పి ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఎనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ....సూర్య సార్ తో కలిసి వర్క్ చేయబోతుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన హీరో సూర్య, డైరెక్టర్ విఘ్నేశ్, స్టూడియో గ్రీన్ సంస్థకు థ్యాంక్స్ తెలియచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments