అంగరంగ వైభవంగా వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లి తెర అవార్డ్స్ ప్రధానోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైన్‌మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏటా లాగే ఈఏడాది కూడా టీవీ అవార్డులు అంగరంగ వైభవంగా జయభేరి క్లబ్ నందు నిర్వహించారు.అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులకు టెక్నీషియన్లను ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి ఛానెల్ నుండి అన్ని క్యాటగరి లలో బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు గత రెండు ఏళ్ళ నుంచి వెండి తెర అవార్డులను కూడా అందించడం విశేషం.సరికొత్తగా విజయభేరీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ప్రొడక్షన్ రంగం లోకి అడుగు పెట్టారు.వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లి తెర అవార్డుల వేదికపై సినీ ప్రముఖులు మురళి మోహన్,వి.కె.నరేష్,వీరుపోట్ల,బాబు మోహన్,అంబికా కృష్ణ లు విష్ణు బొప్పన గారి విజయభేరీ ఆర్ట్స్ సంస్థ లోగో ను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా వచ్చిన మురళి మోహన్ గారు, బుల్లితెర ఉత్తమ నటీ,నటులకు అవార్డులను అందజేసారు..
జెన్నీ కు- లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు.
సినీ,టీవీ నటులు రాజ్ కుమార్ కు-లెజెండరీ అవార్డ్.
వినోదబాలకు-అల్ రౌండర్ అవార్డ్.
ప్రసన్నకుమార్ కు-సోషల్ అవెర్నెస్ అవార్డుల తో పాటు బుల్లి తెర ఉత్తమ నటీనటుల అవార్డ్,ఉత్తమ ఫిమేల్ విలన్ అవార్డ్ లు,స్పెషల్ జ్యురీ అవార్డ్ లను అందజేశారు..
అనంతరం మురళీమోహన్ గారు మాట్లాడుతూ -ఏ కళాకారుడికైనా ఇలాంటి అవార్డులను అందుకోవడం వారికి ఆరోజు పండుగ రోజె. విష్ణు చిన్న కళా కారుడుగా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా మారి, గత 5 సంవత్సరాలుగా ఇలాంటి అవార్డ్స్ కార్యక్రమం చేయడం,వీరికి స్పాన్సర్లు తోడు ఉండడం,రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనిని వీరు చేయడం అభినందనీయం.నా జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ను ఇన్స్పిరేషన్ తీసుకుని తను విజయభేరీ ప్రొడక్షన్ ను స్థాపించడం చాలా సంతోషం. ఈ ప్రొడక్షన్ లో మంచి సినిమాలు తీసి ఏంతో మందికి ఉపాధి కల్పించాలని అన్నారు..
నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ - గత 5 సంవత్సరాలుగా బుల్లితెర అవార్డ్స్ లను అందజేస్తున్న విష్ణువిజయభేరి ప్రొడక్షన్ మొదలుపెట్టడం చాలా సంతోషం. ఈ సంస్థ లో మంచి చిత్రాలు నిర్మించి మా ఆర్టిస్ట్ లకు చాలా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు వీరుపోట్ల మాట్లాడుతూ -- విష్ణు గారి బ్యానర్ లో కొత్త టాలెంట్ తో వచ్చే దర్శకులకు అవకాశాలు కల్పించి ఉత్తమమైన చిత్రాలు నిర్మించాలని అన్నారు.
బాబుమోహన్ మాట్లాడుతూ - విష్ణు అన్ని రంగాల కళా కారులకు అవార్డుల ద్వారా ప్రోత్సహించి వారికి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ: - విష్ణు లాంచ్ చేసిన విజయభేరి ప్రొడక్షన్ లో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు అవకాశం కల్పించి మంచి చిత్రాలు తీయాలి.విష్ణు చేస్తున్న బుల్లి తెర అవార్డ్స్ లను ఇరు తెలుగు రాష్ట్రాలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు..
విష్ణు బొప్పన మాట్లాడుతూ- గత 5 సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ కార్యాక్రమానికి అండగా నిలిచిన స్పాన్సర్ లకు ధన్యవాదాలు.సినీ ప్రముఖుల చేతుల మీదుగా లాంచ్ చేసిన విజయభేరి ప్రొడక్షన్ లో నేను నిర్మించ బోయే చిత్రానికి ఆర్టిస్ట్,టెక్నీషన్ల వివరాలను త్వరలో తెలియ చేస్తానని అన్నారు.
నటుడు రాజకుమార్ మాట్లాడుతూ- స్వర్గస్తులైన దాసరి గారి ఆశీస్సులతో 1980 లో 'అమ్మ రాజీనామా' చిత్రం తో కెరీర్ మొదలు పెట్టిన నేను సినిమా నుండి సీరియల్ వైపు అడుగులు వేయడం జరిగింది.అందరి ఆశీస్సుల తో ఈరోజు నాకు ఇష్టమైన మురళీమోహన్ సార్ చేతుల మీదుగా లెజెండరీ అవార్డ్ అందుకోవడం గర్వాంగా ఉంది.ఇందుకు కారకుడైన విష్ణు బొప్పన కు నా కృతజ్ఞతలు అని అన్నారు..
బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డులు.. ..
1)శ్రీ వాసుదేవ్- లాహిరి లాహిరి లాహిరి లో..
2)సిద్దార్థ వర్మ -మట్టిగాజులు.
3)ఆలీ రజా-మాటే మంత్రము.4)సాయికిరణ్-కోయిలమ్మ..
బెస్ట్ ఫిమేల్ యాక్టర్స్ అవార్డులు*
1)దీపిక-నాలుగు స్తంబాలాట.
2)రేష్మి-పౌర్ణమి.
3)పూజ మూర్తి-గుండమ్మ కథ.
4)ప్రియాంక-మౌనరాగం
స్పెషల్ జ్యురీ అవార్డ్స్
బిగ్ బాస్ ఫెమ్-పునర్నవి.బాబీ లహరి,రాజశ్రీ,జ్యోతిరెడ్డి,మౌనిక,బాబిశ్రీ,రాగిణి
ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన యస్.ఆర్.ఆర్.ఇన్ఫ్రాస్ట్రక్చర్- శ్రీనివాసరెడ్డి,ప్రగతి ఇన్ఫ్రా డేవలపర్స్- సునీల్,అహల్య టౌన్ షిప్- ఉస్మాన్,స్పెస్ విజన్-నరసింహారావు,ప్లాంటేరిఎస్-బాబురావు,శతాబ్ది టౌన్ షిప్-శ్రీనివాసరెడ్డి,ఫిల్మ్ ట్రీ-గోవిందరావు,భారతి ఇన్ఫ్రా-శ్రీ భారతి,పక్కాలోకల్-కోటి గార్లకు ముఖ్య అతిధులుగా వచ్చిన అంబికాకృష్ణ,బాబుమోహన్ లు శాలువా కప్పి సత్కారం చేయడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments