బుల్లితెర రంగంలో విషాదం.. ‘బుల్లి బాలయ్య’ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలిన సంగతి తెలిసిందే. ఆర్ఎంపీ ఆస్పత్రి చూసినా.. ఎంబీబీఎస్ ఆస్పత్రి చూసిన జ్వరాలొచ్చిన జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇలా వైరల్ జ్వరాల భారీన పడిన పలువురు రోగులు ఆరోగ్యం కుదుట పడక తీవ్రంగా బాధపడుతున్నారు. మరోవైపు డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా జ్వరాల భారీన పడిన రోగులు మృత్యువాత కూడా పడుతున్నారు. ఇందుకు కారణం సరైన సమయానికి ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేయించుకోకపోవడం.. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోలేకపోవడంతో ఇలా మరణాలు సంభవిస్తున్నాయి.
జూనియర్ బాలయ్య ఇకలేడు!
ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు బుల్లితెర రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. నందమూరి బాలయ్యకు బుల్లి అభిమాని.. అచ్చం ఆయన హావభావాలతో.. బాలయ్యను తలపింపజేసే బాలనటుడు గోకుల్ సాయికృష్ణ తుదిశ్వాస విడిచాడు. గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న గోకుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు, బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
బాలయ్య బావోద్వేగం..!
‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటిది చిన్నారి అభిమాని గోకుల్ మృతి నా మనసును కలచివేస్తోంది. నేనంటే ప్రాణం ఇచ్చే గోకుల్ ఇంత చిన్న వయసులో డెంగ్యూ కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం అత్యంత బాధ కలిగిస్తోంది. గోకుల్ డైలాగులు చెప్పే విధానం, హావభావాలు ఎంతో బాగుండేవి. ఎంతో భవిష్యత్తు ఉందని భావించేవాడిని’ అని బాలయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. గోకుల్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు, తల్లి సుమాంజలి. ‘డ్రామా జూనియర్స్’ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments