రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. రజినీ ఆరోగ్యాన్ని తమ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని.. అవసరమైన చికిత్సను అందిస్తోందని పేర్కొన్నారు. రక్తపోటును నియంత్రించేందుకు అవసరమైన మందులను జాగ్రత్తగా అందిస్తోందని వెల్లడించారు. ఆయనకు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని.. ఆయనను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని అపోలో వైద్యులు వెల్లడించారు.
‘‘మిస్టర్ రజనీకాంత్ ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయన రక్తపోటును నియంత్రించడానికి అవసరమైన మందులను అందజేస్తున్నాం. ఆయన ఈ రాత్రి ఆసుపత్రిలోనే ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను కలవడానికి సందర్శకులను అనుమతించడం లేదు. కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఎవరూ రావొద్దని మనవి. ఆయన కుమార్తె ప్రస్తుతం ఆయనతోనే ఉంది’’ అని వైద్యులు వెల్లడించారు. కాగా.. తెలంగాణ గవర్నర్ తమిళిసై రజినీ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout