ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. హెల్త్ బులిటెన్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్ధితిపై సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వర్గాలు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరాని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్య బృందం ఎప్పటిప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామి కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి టాలీవుడ్‌లో దశాబ్ధాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం… అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించడం సిరివెన్నెల స్పెషాలిటీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com