బుల్లెట్ రాణి విశేషాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రియాంక కొఠారి కీలక పాత్రలో నటించిన సినిమా బుల్లెట్ రాణి. ఫోకస్ ఆన్ పిక్చర్స్ పతాకంపై రూపొందింది. సాజిద్ ఖురేషి దర్శకత్వం వహించారు. ఎం.ఎస్.యూసఫ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు మాట్లాడుతూ ``సెన్సార్ కూడా ముగిసింది. గబ్బర్ సింగ్ స్టైల్, దూకుడు టాలెంట్, విక్రమార్కుడు హానెస్టీని తీసుకుని ఈ కథ రాశాను. లంచగొండితనాన్ని ఎదిరించి పోరాడే ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ప్రియాంక అద్భుతంగా నటించింది. నో జడ్జిమెంట్ ఒన్లీ పనిష్మెంట్ అనే డైలాగ్ హైలైట్ అవుతుంది. నవంబర్ ఆఖరున సినిమాను విడుదల చే్స్తాం`` అని అన్నారు.
ప్రియాంక కొఠారి మాట్లాడుతూ ``ఇందులో ధైర్యంగా, నీతి నిజాయతీగా ఉండే పోలీస్‌గా నటించాను. దర్శకుడికి మంచి విజన్ ఉంది`` అని తెలిపారు.
ఆశిష్ విద్యార్థి, షఫి, తాగుబోతు రమేష్, రవి కాలే, అమిత్ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు ఎడిటర్: వి.సురేష్ కుమార్, మాటలు: జి.నాగేశ్వరరావు, యాక్షన్: థ్రిల్లర్ మంజు, సంగీతం: గుణ్వంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments