యూపీలో ఘోర ప్రమాదం.. భవనం పైకప్పు కూలి 18 మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్ మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోవడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. శిథిలాలకింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సమచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది. ఆదివారం సదరు శ్మశాన వాటికలో ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మృతుని బంధువులు అక్కడకు ఈ చేరుకున్నారు.
అదే సమయంలో వర్షం రావడంతో అంత్యక్రియలకు హాజరైన మృతుని బంధువులంతా అక్కడే నిర్మాణంలో ఉన్న భవనం కిందకు చేరుకున్నారు. వర్షం కారణంగా భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడిక్కడే 8 మంది మృతి చెందగా.. మరో 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా.. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని యోగి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout