యూపీలో ఘోర ప్రమాదం.. భవనం పైకప్పు కూలి 18 మంది మృతి

  • IndiaGlitz, [Sunday,January 03 2021]

ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్‌‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోవడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. శిథిలాలకింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సమచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది. ఆదివారం సదరు శ్మశాన వాటికలో ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మృతుని బంధువులు అక్కడకు ఈ చేరుకున్నారు.

అదే సమయంలో వర్షం రావడంతో అంత్యక్రియలకు హాజరైన మృతుని బంధువులంతా అక్కడే నిర్మాణంలో ఉన్న భవనం కిందకు చేరుకున్నారు. వర్షం కారణంగా భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడిక్కడే 8 మంది మృతి చెందగా.. మరో 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా.. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని యోగి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

More News

'సైకో వర్మ' సాంగ్ విడుదల

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం "సైకో వర్మ"  వీడు తేడా..టాగ్ లైన్ .

అందుకు మెగా ఫ్యాన్స్  ఒప్పుకుంటారా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

డైరెక్టర్ క్రిష్‌కు కరోనా పాజిటివ్.. పవన్‌తో షూటింగ్ క్యాన్సిల్..

సినీ ప్రముఖులంతా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిందనగానే ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కాస్త రిలాక్స్ అయిపోయారు.

తేజకు అలివేలు దొరికింది.. కానీ..!

డైరెక్ట‌ర్ తేజ ఒకేసారి రెండు సినిమాల‌ను అనౌన్స్‌చేశాడు. అందులో ఓ చిత్రం ‘అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌’.

సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు..

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా శనివారం ఆసుపత్రిలో చేరారు.