AP Budget:రూ.2.86లక్షల కోట్లతో ఏపీ మధ్యంతర బడ్జెట్.. వివరాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ పథకాలు ఫలితాలనిస్తున్నాయని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రూ.2,86,389.27 కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలతో బలహీన వర్గాలను విస్మరించకుండా ఈ బడ్జెట్ రూపొందించామని వెల్లడించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పుకొచ్చారు.
విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన అమలు చేస్తున్నామని చెప్పారు. వెయ్యికి పైగా స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ఐబీ విధానం అవలంబిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యాకానుక పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ అందించేందుకు సంకల్పించామన్నారు. జగనన్న విద్యాదీవెన పథకానికి రూ.11,901 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి రూ.4,267 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా తీర్చిదిద్దేందుకు గానూ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. తాజా బడ్జెట్‌లోనూ వ్యవసాయ రంగానికి, అనుబంధ పరిశ్రమలకు అధిక కేటాయింపులు చేశామమన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాలకు రూ.33.30 వేల కోట్లు వెచ్చించామన్నారు. కౌలు రైతులతో పాటు అటవీ భూములు సాగుచేసుకునే రైతులకు రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. అలాగే వైఎస్సార్ చేయూత పథకానికి రూ.14,129 కోట్లు కేటాయించామన్నారు.
బడ్జెట్ వివరాలు..
వార్షిక బడ్జెట్ రూ. 2,86,389.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,30,110.41 కోట్లు
మూలధన వ్యయం రూ. 30,530.18 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు
ద్రవ్య లోటు రూ. 55,817.50 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
రెవెన్యూ లోటు 1.56 శాతం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout