చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమాకు దిల్‌రాజు కేటాయించిన బ‌డ్జెట్ ఎంతంటే?

  • IndiaGlitz, [Sunday,February 28 2021]

స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమా అంటే నిర్మాత‌లకు ముందు ధైర్యం ఉండాల‌నేది ఇండ‌స్ట్రీలో వినిపించే వార్త‌. ఎందుకంటే శంక‌ర్ ఎంపిక చేసుకునే స‌బ్జెక్ట్ అంత బ‌లంగా ఉంటుంది. అలాంటి సినిమాను హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించాలంటే నిర్మాత‌లు భారీగా ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్‌తో తెలుగు స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి దిల్‌రాజు ఈ క్రేజీ కాంబినేష‌న్‌కు ఎంత బ‌డ్జెట్ కేటాయిస్తాడో అనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. ఈ సినిమా రెమ్యున‌రేష‌న్స్‌ను ప‌క్క‌న ప‌డితే కేవ‌లం మేకింగ్ వ‌ర‌కు మాత్ర‌మే నూట యాబై కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌ను కేటాయించాడ‌ట‌. మ‌రి శంక‌ర్ కేటాయించిన బ‌డ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేస్తాడో లేదో చూడాలి మ‌రి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే శంక‌ర్ సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ట‌.

More News

ఫ్యాన్సీ రేటుకు ‘వ‌కీల్‌సాబ్’ శాటిలైట్.. డిజిటిల్ హ‌క్కులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌,

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం తథ్యం: ప్రశాంత్ కిషోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది తొలి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికలను పీకే ప్రస్తావించారు.

మద్యం తాగి మూడు వాహనాలను ఢీకొట్టిన షణ్ముఖ్ జశ్వంత్

యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఫుల్లుగా మద్యం సేవించి అడ్డంగా బుక్ అయ్యాడు. షణ్ణు మద్యం తాగి కారు నడిపుతూ వేగంగా వెళ్లి మూడు వాహనాలను ఢీకొట్టాడు.

రాజకీయాల వల్ల ఎంతోమంది నష్టపోతారు: లావణ్య త్రిపాఠి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కింది.

నాని రిజెక్ట్ చేసిన ప్రాజెక్టును ఓకే చేసిన వైష్ణవ్!

‘ఉప్పెన’ సినిమా లాక్‌డౌన్ తరువాత.. 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన అనంతరం విడుదలైన సినిమా.