చరణ్, శంకర్ సినిమాకు దిల్‌రాజు కేటాయించిన బడ్జెట్ ఎంతంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్‌తో సినిమా అంటే నిర్మాతలకు ముందు ధైర్యం ఉండాలనేది ఇండస్ట్రీలో వినిపించే వార్త. ఎందుకంటే శంకర్ ఎంపిక చేసుకునే సబ్జెక్ట్ అంత బలంగా ఉంటుంది. అలాంటి సినిమాను హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కించాలంటే నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్‌తో తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి దిల్‌రాజు ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఎంత బడ్జెట్ కేటాయిస్తాడో అనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. ఈ సినిమా రెమ్యునరేషన్స్‌ను పక్కన పడితే కేవలం మేకింగ్ వరకు మాత్రమే నూట యాబై కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించాడట. మరి శంకర్ కేటాయించిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేస్తాడో లేదో చూడాలి మరి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్‌చరణ్, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com