బడ్జెట్ 2020 ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే డిగ్రీ కోర్సులు!
- IndiaGlitz, [Saturday,February 01 2020]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020 వల్ల రైతులకు, విద్యారంగాలకు మాత్రం న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అందేకే ఈ రెండు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా విద్యారంగానికి రూ.99,300 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి రూ.3000 కోట్లు కేటాయించడం శుభపరిణామాని చెప్పుకోవచ్చు. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిగ్రీ పూర్తి చేసే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది.
భారతదేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్ని ఆన్‌లైన్‌లో అందించేలా చర్యలు తీసుకోబోతోంది. ఈ మేరకు దీనికై భారీగానే కేంద్రం వరాల వర్షం కురిపించింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ త్వరలోనే కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
కాగా.. అసలు ఆన్‌లైన్ చదువులు పెట్టాలా..? వద్దా అనేదాని సలహాలు అడగ్గా 2 లక్షల సలహాలు వచ్చాయి. అందుకే ఇక కేంద్రం కూడా మార్చి 2021 నాటికి అప్రెంటీస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది.