లెక్క తేలాలన్న విజయసాయి.. పెద్దరికం తెచ్చుకోమన్న బుద్దా!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం అటు తెలుగు తమ్ముళ్లు.. ఇటు వైసీపీ నేతలు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాదు.. టీడీపీలో ఒకరిపై ఒకరు మొన్నటి వరకూ దుమ్మెత్తిపోసుకున్న విషయం విదితమే. వాస్తవానికి టీడీపీ నేతలు ఇదివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాదిరిగా ఇప్పుడు మీడియా ముందుకు రాలేకపోతున్నారు.. మీడియా మిత్రులు కూడా పెద్ద పట్టించుకోలేదన్నది జగమెరిగిన సత్యం. దీంతో సోషల్ మీడియా వేదికగా వైసీపీపై టీడీపీ.. తెలుగుదేశంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. అంతేకాదు కొన్ని కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి మరి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
మరీ ముఖ్యంగా వైసీపీ మొత్తమ్మీద ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఈయన నిత్యం ఏదో ఒక విషయంపై ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఇక చంద్రబాబు, టీడీపీ నేతలకు అయితే చురకలంటిస్తూ ఉంటారు. అయితే అంతేరీతిలో టీడీపీకి చెందిన కొందరు నేతలు కౌంటర్లిస్తుంటారు. తాజాగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విజయసాయిరెడ్డి
విజయసాయి ఏమన్నారు..!?
"రోమ్ తగలడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని మరపించారు చంద్రబాబు. నీటి కొరత, రోగాలు, కరువు, తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగలేశారు. ఒరిగింది శూన్యం. ఒక్క పరిశ్రమ రాలేదు. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్‌లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలి. 4 రోజుల భోజనాలకు 1.05 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేలాలి" అని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
బుద్దా రిప్లయ్ ఏంటి..!?
"దావోస్‌కి వెళ్ళి చంద్రబాబుగారు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని అడుగుతున్న విజయసాయిరెడ్డి గారూ.. గత ఐదేళ్ళూ మీరసలు రాష్ట్రంలోనే లేకుండా ఢిల్లీలో ఎవరికన్నా పాదపూజలు చేస్తూ ఉన్నారేమో! ఈ అసెంబ్లీ సమావేశాల రికార్డులు తెప్పించుకుని మీ నేతల నోటితోనే చెప్పిన వివరాలు ఒకసారి వినండి. చంద్రబాబుగారు తాగిన నీళ్ళ బాటిళ్ళ లెక్కలు, తిని వదిలేసిన ప్లేట్ల లెక్కలు కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన పడిన కష్టాన్ని లెక్కేసుకోండి. గతంలో మీరు వేసిన దొంగ లెక్కల పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. పెద్దల సభలో ఉన్నారు కాస్తంతయినా పెద్దరికం తెచ్చుకొండి" అని విజయసాయికి బుద్దా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout