ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. బ్రదర్ అనిల్‌తో బీటెక్ రవి భేటీ..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఎప్పుడూ ఎలాంటి పరిణామం జరుగుతుందో ఊహించడం రాజకీయ విశ్లేషకులకు కూడా కష్టమవుతోంది. తాజాగా వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌ని పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి కలిశారు. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి షర్మిల కటుంబం వెళ్లే సమయంలో వీఐపీ లాంజ్‌లో వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రకరకాల చర్చలు మొదలయ్యాయి.

అసలు రాష్ట్ర రాజకీయాలతో పాటు కడపలో ఏం జరుగుతోందని జోరుగా చర్చ జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయం కావడం.. వెంటనే బ్రదర్ అనిల్‌తో టీడీపీ నేత భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడంతో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో అసంతృప్తికి ఉన్న నేతలు ఆమె వెంట నడవడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరిన మరుక్షణమే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీటెక్ రవి.. షర్మిల భర్తతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పులివెందులలో సీఎం జగన్‌పై బీటెక్ రవి పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా జగన్‌ను ఓడించాలని చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు షర్మిల సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ షర్మిల కాంగ్రెస్‌ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తే టీడీపీ సహకారం ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే పులివెందులలో బీటెక్ రవి గెలుపునకు షర్మిల కూడా తన వంతు సపోర్ట్ ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారట.

కొన్ని రోజుల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ-కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారట. వారి ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారట. మరి మున్ముందు ఏపీ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

More News

YS Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. వివాదాస్పద నేతలకు చెక్‌..

ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు దూకుడుగా ప్రవరిస్తూనే మరోవైపు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు సామాజిక వర్గాల లెక్కలు..

YS Jagan: కుటుంబాలను చీల్చే కుట్రలు.. షర్మిలపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు..

ఏపీ సీఎం జగన్(CM Jagan) తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో పరోక్షంగా స్పందించారు.

‘రాఘవ రెడ్డి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - హీరో శివ కంఠమనేని

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో

Gautham Adani: హిండెన్‌ బర్గ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదానీకి భారీ ఊరట..

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Adani)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్(Hindenburg) నివేదికపై సెక్యూరిటీస్

Saindhav Trailer: యాక్షన్ సీన్స్‌తో 'సైంధవ్' ట్రైలర్.. సైకోగా అదరగొట్టిన వెంకీ..

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'(Saindhav). 'హిట్', 'హిట్ 2' చిత్రాల దర్శకడు శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ మూవీ