నా స్టామినాకి, నా స్పీడుకి ఫ్యూయల్ నా అభిమానులే : చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై దానయ్య నిర్మించారు.ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తుండడం విశేషం. బ్రూస్ లీ చిత్రాన్ని దసరా కానుకగా ఈనెల 16న రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన బ్రూస్ లీ ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆడియో సి.డి.ని ఆవిష్కరించి తొలి సి.డి.ని డైరెక్టర్ నినాయక్ కి అందచేయగా... వినయాక్ బ్రూస్ లీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. బ్రూస్ లీ ఆడియో ఆవిష్కరణోత్సవం విశేషాలు మీకోసం...
అందుకనే బ్రూస్ లీ టైటిల్..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...అభిమానులను ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇష్టమైన మాట బ్రూస్ లీ. ఆయన నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా చాలా సార్లు చూసాను.ఒక్క సినిమాతోనే చాలా పాపులర్ అయ్యారు. బ్రూస్ లీ టైటిల్ తో సినిమా చేయడం చూస్తుంటే నిజంగా చరణ్ ధన్యుడు అనిపిస్తుంది. ఎంటర్ ది డ్రాగన్ సినిమాలానే ఈ సినిమాలో కూడా బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అందుకనే ఈ సినిమాకి బ్రూస్ లీ అని టైటిల్ పెట్టారనుకుంటున్నాను అన్నారు.
శ్రీను వైట్ల తర్వాతే ఎవరైనా...
ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే అక్టోబర్ 16న రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆరోజు చెప్పినట్టే రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ అంతా చాలా కష్టపడ్డారు. ఈ సందర్భంగా వారందరికీ ధ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు చిరంజీవి. రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి చెప్పాలంటే...కామెడీ టైమింగ్ తో సినిమాలు తీయాలంటే శ్రీను వైట్ల తర్వాతే ఎవరైనా. శ్రీను వైట్లతో అందరివాడు సినిమాలో నటించాను. మళ్లీ ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. 150వ సినిమా చేస్తున్నాను. ఇందులో నటించడం అవసరమా..అన్నాను. కానీ నాకోసం సీన్ క్రియేట్ చేసారు. ఆ సీన్ లో అభిమానులను గుర్తు చేసుకునేలా డైలాగ్స్ రాయించారు. నేను కనిపించేది కొద్దిసేపే అయినా అభిమానులను గుర్తు చేసుకునేలా డైలాగ్ ఉండడంతో సంత్రుప్తిగా అనిపించింది అని చెప్పారు.
బ్రూస్ లీ లో చిరు డైలాగ్..
ఈ సినిమాలో నేను, చరణ్ చెప్పిన డైలాగ్స్ ఏమిటంటే....బాస్..మీ స్టామినాని మ్యాచ్ చేయడం..మీ స్పీడ్ ను క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు అని చరణ్ అంటే..నా స్టామినాకి, నా స్పీడుకి ఫ్యూయల్ నా అభిమానులే..మన అభిమానులే.. మన అభిమానులు మన కోసం ఎదురుచూస్తున్నారు..వాళ్ల కోసం వెళ్లాలి వెళ్ళుతున్నాను బై..అని అంటాను అని చెప్పారు చిరు.
ఇక 150వ సినిమా విషయానికి వస్తే..150వ సినిమాకి చరణ్, సురేఖ నిర్మాతలు. మిగిలిన వివరాలను నిర్మాతలు బ్రూస్ లీ రిలీజ్ అయ్యే లోపే తెలియచేస్తారు అన్నారు.
బ్రూస్ లీ లో హైలెట్ సీన్ అదే..
రామ్ చరణ్ మాట్లాడుతూ...మే లో సినిమా ప్రారంభించాం..5 నెలలోనే షూటింగ్ పూర్తి చేసాం. నా కెరీర్ లో ఇప్పటి వరకు ఇంత ఫాస్ట్ గా చేసిన సినిమా ఇదే. ఖర్చు విషయంలో రాజీపడకుండా దానయ్య గారు ఈ సినిమాని నిర్మించారు. ఆయన లేకపోతే ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేసేవాళ్లం కాదు.రైటర్స్ కోన, గోపీ మంచి కథ అందించారు. ఈ సందర్భంగా ధ్యాంక్స్ చెబుతున్నాను.బ్రూస్ లీ సాంగ్ ఒక్కేటే బ్యాలెన్స్ ఉంది.త్వరలోనే కంప్లీట్ చేసి ముందు చెప్పినట్టుగా ఈ నెల 16న బ్రూస్ లీ రిలీజ్ చేస్తాం. క్రుతి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ నాకు సిస్టర్ గా నటించింది. సినిమా కథ అంతా అక్క, తమ్ముడు మథ్య నడుస్తుంది. నాన్నగారితో షూటింగ్ లో పాల్గొన్నప్పుడు టెన్షన్ పడ్డాను. నాన్న గారు కనిపించేది కాస్తసేపే అయినా ఆ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి అన్నారు.
అన్నయ్య కత్తి..
డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ...చిరంజీవి గారు బ్రూస్ లీ షూటింగ్ లో ఉన్నారని తెలిసి వెళ్లి చూసాను. అన్నయ్య నిజంగా కత్తి లా ఉన్నారు.బ్రూస్ లీ ట్రైలర్ చాలా బాగుంది. రామ్ చరణ్ ని నేను రాయల్ చరణ్ అని అంటుంటాను.నిజంగా చరణ్ రాయల్ గా కమిట్మెంట్ తో ఉంటాడు. శ్రీను వైట్ల కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం.కోన, గోపీ మోహన్ కాంబినేషన్ ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. ఖచ్చితంగా బ్రూస్ లీ పెద్ద హిట్ అవుతుంది అన్నారు.
చరణ్ తో పాటు చిరంజీవిగారు..
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ...ఫస్ట్ చిరంజీవిగారు స్ర్కిప్ట్ విని ఓకె చేసారు. చరణ్ ని ఇవ్వడంతో పాటు చిరంజీవి గారు కూడా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో అలానే ఈ సినిమాలో ఉంటారు.కోన, గోపీ నాతో కలసి ఎన్నో సినిమాలు చేసారు.ఈ సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. వారిద్దరికి ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను.తమన్ మంచి మ్యూజిక్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా అందించాడు. సినిమాని అక్టోబర్ 16న రిలీజ్ చేయడానికి అందరూ కష్టపడి వర్క్ చేస్తున్నారు. దానయ్య గారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరికీ నచ్చేలా బ్రూస్ లీ ఉంటుంది అన్నారు.
చిరుతో 151వ సినిమా..
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...గీతా ఆర్ట్స్ కు మగథీరుడు రామ్ చరణ్. తన టాలెంట్ తో రోజురోజుకు అభివ్రుద్ది చెందుతుండడం ఆనందంగా ఉంది.చిరంజీవిగారు ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ లో నటించారు. ఆయన షూటింగ్ లో ఉన్న మూడు రోజులు నేను షూటింగ్ కి వెళ్లాను. తండ్రీకొడుకులు ఇద్దరు గుర్రం మీద వస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు.చిరంజీవిగారు 150వ సినిమా తర్వాత నాతో సినిమా చేస్తానని చెప్పారు. త్వరగా 150వ సినిమా చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిరు ఆయుష్షు పోసారు..
కోన వెంకట్ మాట్లాడుతూ...2003 నుంచి మేము ఫస్ట్ టైం వర్క్ చేసిన హీరోల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖచ్చితంగా రామ్ చరణ్ బ్రూస్ లీ కూడా బిగ్ హిట్ అవుతుంది. అందరు ఈ సినిమాను ప్రేమించి జీవం పోస్తే..చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చి ఆయుష్షు పోసారు అన్నారు.
చరణ్ వండర్ ఫుల్ యాక్టర్..
అరుణ్ విజయ్ మాట్లాడుతూ...మా నాన్నగారు విజయ్ కుమార్. చిరంజీవి గారితో స్నేహంకోసం చిత్రంలో నటించారు. తెలుగులో నా మొదటి సినిమా చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.తమిళ్ లో హీరోగా చాలా చిత్రాల్లో నటించాను. గౌతమ్ మీనన్ గారి ఎంతవాడుగానీ చిత్రంలో విలన్ గా నటించాను.రామ్ చరణ్ ఆ సినిమాలో నన్ను చూసి శ్రీను వైట్ల గారికి నా పేరు సజెస్ట్ చేసారు. రామ్ చరణ్ వండర్ ఫుల్ యాక్టర్. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను అన్నారు.
సరికొత్త రికార్డులు...
నిర్మాత ఎన్వీ.ప్రసాద్ మాట్లాడుతూ... ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్నబ్రూస్ లీ పేరుతో ఈ సినిమా వస్తుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ పెద్ద హిట్ అయి సరికొత్త రికార్డలు స్రుష్టించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.విఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, తమన్, నదియా, రామజోగయ్య శాస్త్రి, జానీ మాస్టర్, క్రుతి కర్భంధ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments