'బ్రూస్ లీ' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి అతిథిపాత్ర, రామ్ చరణ్ మెయిన్ హీరో.శ్రీనువైట్ల వంటి స్టార్ డైరెక్టర్ ఇంతకంటే మెగాభిమానులకు ఏం కావాలి.సినిమా బియాండ్ ద లిమిట్స్ ఉంటుందని ప్రతి ఒక అభిమాని ఆశించాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద చిరుతగా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దాదాపు 40 కోట్లు మార్కు దాటిన సినిమాలే. గోవిందుడు అందరివాడేలే చిత్రం తర్వాత రామ్ చరణ్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ దఫైటర్. కుటుంబానికి, ఫ్యామిలీకి సపోర్ట్ చేసే కొడుకుగా రామ్‌చరణ్ ఎలా ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే...
కథ
కార్తీక్(రామ్‌చరణ్)కి తన తండ్రి రామచంద్రరావు(రావు రమేష్), అక్క(కృతికర్భందా) అంటే చాలా ఇష్టం. రామచంద్రారావు కూడా తన కొడుకును కలెక్టర్ చేయాలనుకుంటాడు. అందుకోసం కూతురిని ఎంకరేజ్ చేయడు. కానీ అక్కకు బాగా చదువుకోవాలనే కోరిక ఉంటుంది. అక్క కోసం కార్తీ తన చదువును ఆటకెక్కించి స్టంట్ మాస్టర్ బ్రూస్ లీగా మారుతాడు. డేంజర్ డేవిడ్(జయప్రకాష్ నారాయణ్) దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో పోలీస్ గెటప్‌లో వెళ్ళి విలన్స్ నుండి ఓ అమ్మాయిని కాపాడుతుంటే బ్రూస్లీని చూసిన రియా(రకుల్ ప్రీత్ సింగ్) ఇష్టపడుతుంది. బ్రూస్లీని పోలీస్ ఆఫీసర్‌గా భావిస్తుంది. బ్రూస్ లీ కూడా తను పోలీస్ ఆఫీసర్ కాదనే నిజాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కథ ఇలా రన్ అఅవుతున్నప్పుడు రియా కొన్ని రిస్కీ ఆపరేషన్స్ లో పాల్గొంటుంది. అక్కడ విలన్స్‌ను చితకొట్టి రియాను కార్తీక్ కాపాడుతాడు. దీంతో విలన్స్‌కు బాగా నష్టం వస్తుంది. దాంతో దీపక్ రాజ్(అరుణ్ విజయ్) బ్రూస్లీని కనిపెట్టి చంపాలనుకుంటుంటాడు. మరో పక్క కార్తీ అక్క నచ్చడంతో కార్తీ తండ్రి రామచంద్రారావు పనిచేసే వసుంధర లాబొరేటరీస్ ఎం.డి జైరాజ్(సంపత్‌రాజ్) తమ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కార్తీ అక్కను దీపక్ రాజ్ డ్రగ్స్ కేసులో ఆరెస్ట్ చేయిస్తాడు. ఆ దొంగకేసు నుండి అక్కను బయటపడేయడానికి దీపక్రాజ్తో బ్రూస్లీ గొడవపడతాడు. ఆ గొడవలో దీపక్ రాజ్ కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అసలు విలన్ ట్రాక్ లోకి వస్తాడు.అసలు దీపక్‌రాజ్ ఎవరు? అతనికి వసుందర లాబోరేటరీస్కు ఉన్న సంబంధం ఏంటి? అక్క కోసం కార్తీక్ ఎలాంటి రిస్క్ తీసుకుంటాడు? తన తండ్రిని, ఫ్యామిలీని విలన్స్ దగ్గర నుండి ఎలా కాపాడుకుంటాడు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
రామ్‌చరణ్ ఎనర్జీ సినిమాకే హైలైట్ అయ్యింది. ఈ సినిమాలో చెర్రీ కొత్తగా కనపడ్డాడు. తన కామెడి టైమింగ్ సూపర్బ్. డ్యాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సాంగ్‌లో స్టెప్స్ ఇరగదీశాడు.యాక్షన్ పార్ట్ లో అదరగొట్టాడు. రావురమేష్, చరణ్‌ల మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రకుల్ గ్లామరస్‌గా కనపడింది. పెరఫార్మెన్స్ పరంగా చెప్పుకోదగ్గ పాత్రేం కాదు. రావు రమేష్ మధ్య తరగతి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు.సంప్ రాజ్ యాజ్ యూజువల్ విలన్ గా తన పని కానిచ్చేశాడు. ఆరుణ్ విజయ్ నెగటివ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కృతికర్భందా చరణ్ అక్క పాత్రలో ఒదిగిపోయి నటించింది. డేంజర్ డేవిడ్, సి.ఐ రామ్‌జీ పాత్రల్లో మంచి వేరియేషన్ చూపించాడు. సుజ్కీ సుబ్రమణ్యంగా బ్రహ్మానందం కామెడి పాత్ర ఆకట్టుకుంటుంది. చివరలో మెగాస్టార్ ఎంట్రీ ఎక్సలెంట్. అభిమానులు కోరుకునే విధంగా చిరంజీవి 150వ సినిమా రీ ఎంట్రీ ట్రైలర్ అదిరింది. శ్ర్రీనువైట్ల డైరెక్షన్ విషయంలో కేర్ తీసుకుని చేశాడు. సినిమ ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ పాయింట్‌తో నడిస్తే సెకండాఫ్ అంతా కామెడి ట్రాక్ తో ఆకట్టుకున్నాడు. థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. లే చలో... సాంగ్, రియా రియా ..సాంగ్ కుంఫు కుమారి...సాంగ్స్ ఆకట్టుకుంటాయి. మనోజ్ పరమహంస సినిమాటో్గ్రఫీ ఎక్సలెంట్. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ , సాంగ్స్‌లో మనోజ్ ఫ్రేమింగ్ బావుంది. ప్రొడక్షన్ విలువలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్
శ్రీనువైట్ల సినిమాని నడిపించిన విధానం పాత స్టయిల్లోనే కనపడింది. అయితే భారీ తారాణం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాని అందంగా చూపించడంలో సపోర్ట్ చేశాయి. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బాగాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లెంగ్త్ పెరిగినట్లు అనిపిస్తుంది. సినిమాలో అక్కడక్కడా మనకు పాత సినిమాల వాసన తగిలింది.
విశ్లేషణ
రామ్‌చరణ్‌తో కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నానని శ్రీనువైట్ల అన్నాడే కానీ ఎప్పటిలాగానే పాత ఫార్ములతోనే కథను రాసుకున్నాడు. రచయితలు కోనవెంకట్, గోపిమోహన్ లతో శ్రీనువైట్ల కలిసి పనిచేసినా అదే ఫార్మేట్ ను స్టయిల్‌నే ఫాలో అయ్యారు. ఈ సినిమాకి మేజర్ ఎసెట్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్, కెమెరా వర్క్ చేసిన మనోజ్ పరమహంస. ముఖ్యంగా థమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. వీరందరూ ఒక ఎత్తయితే చిరంజీవిని కీలకపాత్రలో నటింంపచేయాలనుకోవడం అంటే దాదాపు ఏడేళ్ళ తర్వాత చిరు మళ్ళీ సినిమాల్లో కనపడటం, అందుకు తగిన విధంగా చిరంజీవి ఎంట్రీని డైరెక్టర్ డిజైన్ చేయడం సూపర్. సినిమాలో లాజిక్స్ మిస్సయినా కామెడితో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేయడం చాలా వరకు ప్లస్ అయ్యింది. చరణ్ కొత్తగా ప్రయత్నించాడు..ఆడపిల్లలతో కాదు మగాడొచ్చాడు..,
వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా.. ఒకసారి మొదలెట్టిన తర్వాత రియాక్షన్స్ కనపడవ్, రిసౌండ్స్ మాత్రమే వినపడతాయి..., లక్ష్యం కోసం అందరూ పరిగెడతారు కానీ కొందరు మాత్రమే ఎదుటివాళ్ళ లక్ష్యం కోసం నిలబడతారు.., అలాగే చరణ్ రకుల్‌తో చెప్పే ఎలాగెలాగా అనే డైలాగ్ చెప్పే విధానంతో పాటు చివర్లో చిరంజీవి రకుల్ తో ఎలాగెలాగ..అంటూ డైలాగ్ చెప్పే విధానం బావుంది. డైలాగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మిగిలిన వాళ్ళంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
బాటమ్ లైన్
ఫ్యామిలీ కోసం ఫైటర్ గా మారిన 'బ్రూస్ లీ ఫైటర్ బాక్సాఫీస్ విజేత..
రేటింగ్: 3.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments