రామ్ చరణ్ 'బ్రూస్ లీ' టీజర్ రివ్యూ...

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బూస్ లీ'. ది ఫైటర్ ఉపశీర్షిక. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నాన్న చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదల చేసిన టీజర్ తో తన సినిమా మేకింగ్ వాల్యూస్, యాక్షన్ స్టయిల్ ను తెలుగు ప్రేక్షకులకు లైట్ గా టచ్ చేసిన రామ్ చరణ్ బాబాయ్ బర్త్ డే కానుకగా మరో టీజర్ ను విడుదల చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం...

30 సెకన్ల నిడివితో టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఓ భారీ భవంతి లుక్ తో స్టారవుతుంది. హాయ్ అంటూ రకుల్ విషెష్ చెబుతుంది., కొన్ని కలర్ ఫుల్ సీన్స్ ప్రెజంట్ అవుతాయి. ఈ సీన్స్ లో నదియా, సంపత్ రాజ్, రావు రమేష్ తదితరులు మనకు కనపడతారు. ఎంగేజ్ మెంట్ కి ఈ గిఫ్ట్ చాలా అని చరణ్ కృతికర్భందాని అడగటం, నాకు లైఫ్ లో నువ్వే ఒక పెద్ద గిఫ్ట్ రా అని తను చెప్పే మరో డైలాగ్ వినపడుతుంది.

స్కూటీపై రకుల్ వెనుక కూర్చోన్న చరణ్ రావు రమేష్ ను చూసి ముఖం వెనక్కి తిప్పుకోవడం, మీ నాన్న చూస్తే నాకు చాలా ఆసూయగా ఉందిరా అని అన్న తల్లితో చరణ్ ఏం అని అడుగుతాడు..ఆయనంటే నీకు ప్రాణం అని తల్లి చరణ్ తో చెబుతుంది. చరణ్ నీళ్ళు నిండిన కంటితో రావు రమేష్ ను కౌగిలించుకుంటాడు. అక్కడితో టీజర్ ముగుస్తుంది. హ్యపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పవన్ లుక్ తో విషెష్ వస్తుంది. టీజర్ చివర్లో సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని విషయం తెలిసే టైటిల్ వస్తుంది.