24న బ్రూస్ లీ సాంగ్ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ చరణ్ నటిస్తున్న సినిమా బ్రూస్ లీ. సినిమా పేరు నుంచి, టీమ్ చెప్పే విషయాలు, చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ వరకు ఈ సినిమాలో చాలా విశేషాలే ఉన్నాయి. ఆ మధ్య విడుదలైన టీజర్లకు మంచి స్పందనే వస్తోంది.అక్టోబర్ 2న ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. తమన్ స్వరాలను అందించారు. ఈనెల 24న ఈసినిమాకు సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా ఈ గిఫ్ట్ ను ప్రేక్షకులకు అందించనున్నారు. మంగళవారం శ్రీనువైట్ల తనయ అహనా పుట్టినరోజును జరుపుకుంటోంది. అంటే ఈ వారమంతా వైట్ల కుటుంబంలో పండుగ వాతావరణమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments