బ్రూస్ లీ సెంటిమెంట్ ఫాలో కాలేదా...?

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

రామ్ చ‌ర‌ణ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న బ్రూస్ లీ ఈనెల 16న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...బ్రూస్ లీ సినిమాలో చిరు, చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టించారు.

గ‌తంలో వీళ్లిద్ద‌రు క‌ల‌సి న‌టించిన మ‌గ‌థీర ఎంత‌టి సంచ‌ల‌నం స్రుష్టించిందో తెలిసిందే. అలాగే శ్రీను వైట్ల‌, కోన వెంక‌ట్, గోపీ మోహ‌న్..ఈ ముగ్గ‌రు క‌ల‌సి వ‌ర్క్ చేసిన సినిమాల‌న్నీ విజ‌యం సాధించాయి. బ్రూస్ లీకి ఈ ముగ్గురు క‌ల‌సి వ‌ర్క్ చేసారు. అలాగే న‌దియా ఈమ‌ధ్య‌ న‌టించిన సినిమాల‌న్నీ విజ‌యం సాధించాయి. బ్రూస్ లీ లో కూడా న‌దియా న‌టించారు. అలాగే హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం సినిమాలు విజ‌యం సాధించాయి.బ్రూస్ లీలో హీరోయిన్ ర‌కులే. బ్రూస్ లీ స‌క్సెస్ కోసం...ఇన్ని సెంటిమెంట్స్ ఫాలో అయ్యారా అని అడిగితే...సెంటిమెంట్స్ ఆలోచించి కాంబినేష‌న్స్ సెట్ చేయ‌లేదు. అలా కుదిరింది అంతే అన్నాడు శ్రీను వైట్ల‌. మ‌రి..సెంటిమెంట్ ఫాలో కాలేదు అంటూనే ఫాలో అయిన బ్రూస్ లీ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.